నడిరోడ్డుపై యువకుడిని బూటుతో చితక్కొట్టిన కానిస్టేబుల్.. వీడియో కావడంతో..  

ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో ఓ పోలీసు కానిస్టేబుల్  బహిరంగంగా ఒక యువకుడిని బూట్లతో కొట్టిన వీడియో బయటపడింది.ఈ వీడియో వైరల్‌గా మారడంతో పోలీసులు మొత్తం విషయంపై దృష్టి సారించారు. కానిస్టేబుల్‌ను ఎస్పీ సస్పెండ్ చేశారు.

Uttar Pradesh cop thrashes drunk man with shoe, suspended KRJ

ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో ఓ అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ  పోలీసు కానిస్టేబుల్ తన బూటుతో ఒక వ్యక్తిని  దారుణంగా కొట్టాడు. ఈ ఘటన మొత్తం కెమెరాకు చిక్కింది. 4.38 నిమిషాల నిడివి గల వీడియోలో దినేష్ అత్రి అనే  పోలీసు కానిస్టేబుల్ ఉన్నట్టు గుర్తించారు. ఆ వ్యక్తిని  షూతో 61 సార్లు కొట్టడాన్ని చూడవచ్చు. ఆ వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తుంది. వీడియో వైరల్ కావడంతో  పోలీసు కానిస్టేబుల్ దినేష్ అత్రిని సస్పెండ్ చేశారు, అతనిపై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. 

వివరాల్లోకెళ్తే..  హర్దోయ్ జిల్లాలోని షహాబాద్ కొత్వాలి ప్రాంతంలో శనివారం నాడు పోలీసు కానిస్టేబుల్ దినేష్ అత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాడు. కానీ, కానిస్టేబుల్ సివిల్ డ్రెస్ లోనే ఉన్నారు. ఈ కానిస్టేబుల్ సరుకులు కొనడానికి  దుకాణానికి వెళ్ళాడు. అక్కడ ఓ యువకుడు మహిళలతో సహా ప్రజలతో అసభ్యంగా ప్రవర్తించడం. ఆ యువకుడు కానిస్టేబుల్ పై కూడా అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఆ కానిస్టేబుల్.. తన బూట్లు విప్పి యువకుడిని తీవ్రంగా కొట్టడం ప్రారంభించాడని చెబుతున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసు శాఖలో కలకలం రేగింది
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ వ్యక్తి ఇతరులతో అనుచితంగా ప్రవర్తించకుండా పోలీసు కానిస్టేబుల్ దినేష్ అత్రి అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఘర్షణ మొదలైంది. కానీ ఆ వ్యక్తి పోలీసులతో కూడా అనుచితంగా ప్రవర్తించాడు, ఆ తర్వాత పోలీసు తన బూటుతో కొట్టాడు. ఈ ఘటనపై అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ASP) వెస్ట్ దుర్గేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. తాము ఆ వైరల్ వీడియోను గమనించామనీ, వీడియో షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బెజా క్రాసింగ్ ప్రాంతానికి చెందినదని  తెలిపారు.

దినేష్ అత్రి అనే కానిస్టేబుల్ సివిల్ డ్రెస్ లో మార్కెట్‌ను సందర్శిస్తున్నాడు. అక్కడ  అతను తాగిన స్థితిలో ఒక వ్యక్తిని చూశాడు. అతను ప్రజలను దుర్భాషలాడుతూ.. స్థానికులను అడ్డగించే ప్రయత్నం చేశారు. దీంతో  ఆ కానిస్టేబుల్ అనుచితంగా ప్రవర్తించాడు. ఇది గొడవకు దారితీసింది. పబ్లిక్ గా అనుచితంగా ప్రవర్తించిన ఆ పోలీసును తక్షణమే సస్పెండ్ చేశామని ASP దుర్గేష్ కుమార్ సింగ్ తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios