శివుడు రమ్మన్నాడని.. కానిస్టేబుల్ లీవ్...ఖంగుతిన్న అధికారులు

Uttar Pradesh constable seeks leave, says Shiva wants jalabhishek in dream
Highlights

ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఓ కానిస్టేబుల్ పంపిన లీవ్ అప్లికేషన్ చూసి అధికారులు ఖంగుతున్నారు. తనకు కలలో శివుడు కనిపించి రమ్మంటున్నాడని.. ఇందుకు గాను ఆరు రోజులు సెలవు ఇప్పించాల్సిందిగా అతను దరఖాస్తులో పేర్కొనడంతో అధికారులు ఆశ్చర్యపోయారు

ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఓ కానిస్టేబుల్ పంపిన లీవ్ అప్లికేషన్ చూసి అధికారులు ఖంగుతున్నారు. తనకు కలలో శివుడు కనిపించి రమ్మంటున్నాడని.. ఇందుకు గాను ఆరు రోజులు సెలవు ఇప్పించాల్సిందిగా అతను దరఖాస్తులో పేర్కొనడంతో అధికారులు ఆశ్చర్యపోయారు.

బులంద్‌షహర్‌కు చెందిన వినోద్‌కుమార్ అనే కానిస్టేబుల్‌‌కు దైవ భక్తి చాలా ఎక్కువ.. ఈ క్రమంలో ఒక రోజు అతని కలలో శివుడు కనిపించి హరిద్వారా రమ్మన్నాడట... అలాగే జలాభిషేకం కోసం కావడి తీసుకుని రమ్మన్నాడట.. భగవంతుడి కోరిక తీర్చడానికి తనకు సెలవు కావాలని దరఖాస్తు చేసుకోవడం పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 
 

loader