ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్  శుక్రవారం నాడు ఢిల్లీ వెళ్లనున్నారు. రెండోసారి సీఎంగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు చేపట్టనున్నారు. మంత్రి వర్గ కూర్పుపై పార్టీ అగ్రనేతలతో యోగి ఆదిత్యనాథ్ చర్చించనున్నారు.

న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్ సీఎం Yogi Adityanath శుక్రవారం నాడు New Delhi కి వెళ్లనున్నారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో BJPరెండో దఫా అధికారాన్ని కైవసం చేసుకొంది. దీంతో Uttar Pradesh Assembly Election Result 2022 రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి బీజేపీ అగ్ర నేతలతో యోగి ఆదిత్యనాథ్ చర్చించనున్నారు. బీజేపీ చీఫ్ JP Nadda సహా పలువురు మంత్రులను యోగి ఆదిత్యనాథ్ కలిసే అవకాశం ఉంది. మంత్రి వర్గ కూర్పుపై చర్చించనున్నారు. Cabinet లో ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఎవరెవరిని కొనసాగించనున్నారు, ఎవరికి ఉద్వాసన పలకనున్నారనే విషయమై త్వరలోనే తేలనుంది. 

2017లో జరిగిన ఎన్నికల కంటే ఈ దఫా కొన్ని సీట్లు తగ్గినప్పటికీ బీజేపీ స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొనే మ్యాజిక్ ఫిగర్ ను దాటి ఎమ్మెల్యేలను కైవసం చేసుకొంది. Congress , BSP లు ఈ దఫా ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూట గట్టుకున్నాయి. ఈ రెండు పార్టీలు గతంలో కంటే తక్కువ సీట్లను కైవసం చేసుకొన్నాయి. 

ఈ దఫా యూపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని సమాజ్ వాదీ పార్టీ పెట్టుకున్న ఆశలపై ఓటర్లు నీళ్లు చల్లారు. అయితే గతంలో కంటే అధిక సీట్లను Samajwadi Party కైవసం చేసుకొంది. ఇతర పార్టీలతో సమాజ్ వాదీ పార్టీ పెట్టుకున్న పొత్తులు కూడా Akhilesh Yadav పార్టీకి కలిసి రాలేదు. 

ఎన్నికల ముందు బీజేపీ నుండి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేల ప్రభావం కూడా కమలం పార్టీ విజయాన్ని నిలువరించలేకపోయాయి. బీజేపీ దూకుడుకు కళ్లెం వేసేందుకు అఖిలేష్ యాదవ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోలేకపోయింది సమాజ్ వాదీ పార్టీ.

గత ఐదేళ్లో యూపీలో యోగి ఆదిత్యనాథ్ పాలనకు ప్రజలు కట్టారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రెండో దఫా అధికారంలోకి రావడంతో యూపీలో బీజేపీ మరింత దూకుడుగా రానున్న రోజుల్లో వ్యవహరించే అవకాశాలు లేకపోలేదు.