ఆ రెండు రాష్ట్రాల వాళ్లు ‘ముందస్తు బెయిల్’ పొందలేరు.. కానీ ఇక నుంచి..?

uttar pradesh and uttarakhand Govts set To Table Modified bill to Restore Anticipatory Bail
Highlights

దేశంలోని ఎవరైనా వ్యక్తులపై నేరారోపణలు వచ్చినప్పుడు వారిని పోలీసులు అరెస్ట్ చేయకుండా ఆయా వ్యక్తులు ముందుగానే కోర్టుల నుంచి ‘ముందస్తు బెయిల్ ’ పొందుతారు. అయితే దేశంలోని రెండు రాష్ట్రాలకు మాత్రం ఈ సదుపాయం లేదు

దేశంలోని ఎవరైనా వ్యక్తులపై నేరారోపణలు వచ్చినప్పుడు వారిని పోలీసులు అరెస్ట్ చేయకుండా ఆయా వ్యక్తులు ముందుగానే కోర్టుల నుంచి ‘ముందస్తు బెయిల్ ’ పొందుతారు. అయితే దేశంలోని రెండు రాష్ట్రాలకు మాత్రం ఈ సదుపాయం లేదు. అయితే  ఇక నుంచి ఆ రెండు  రాష్ట్రాలకు కూడా ఈ సదుపాయం కల్పించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఇంతకీ ఆ రెండు రాష్ట్రాలు ఏంటంటే.. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్..

దేశంలో నమోదయ్యే నేరాల్లో అత్యధిక శాతం ఈ రెండు రాష్ట్రాల్లోనే నమోదవుతుండటంతో.. నేరస్థులు అరెస్టుల నుంచి తప్పించుకోవడానికి అవకాశం లేకుండా ముందస్తు బెయిల్ ఆప్షన్‌ను ఈ రెండు రాష్ట్రాల్లో లేకుండా చేశారు. 1975లో ఎమర్జెన్సీ విధించిన తర్వాతి సంవత్సరం నుంచి యూపీలో ముందస్తు బెయిల్ అవకాశాన్ని ఎత్తివేశారు. అయితే ఈ అవకాశం లేకపోవడం వల్ల క్రిమినల్ కేసుల్లోని నేరస్థులను పోలీసులు వెంటనే అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ తర్వాత నిందితులు బెయిల్ పొందే విధంగా అక్కడి చట్టాలు ఉన్నాయి.

ఈ ఇబ్బందుల దృష్ట్యా ముందస్తు బెయిల్ సదుపాయాన్ని పునరుద్ధరించేందుకు అసరమైన నిబంధనలు రూపొందించి తెలియజేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. దీనిపై ఉభయ రాష్ట్రాలు స్పందించాయి.. నిబంధనలు రూపొందించేందుకు వారం రోజుల సమయం కావాల్సిందిగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానికి తెలియజేయగా.. త్వరలోనే బిల్లు ప్రవేశపెట్టేందుకు ఉత్తరప్రదేశ్ రెడీ అవుతోంది. 

loader