g20 summit 2023 : ఢిల్లీ చేరుకున్న జో బైడెన్.. అమెరికా అధ్యక్షుడి హోదాలో తొలిసారిగా భారత్‌కు
జీ 20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు గాను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్‌కు చేరుకున్నారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జో బైడెన్ భారత్‌కు రావడం ఇదే తొలిసారి.

జీ 20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు గాను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్‌కు చేరుకున్నారు. అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్, పలువురు అధికారులు జో బైడెన్‌కు ఘనస్వాగతం పలికారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జో బైడెన్ భారత్‌కు రావడం ఇదే తొలిసారి. కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోడీతో బైడెన్ భేటీ కానున్నారు. ఆయనకు తన అధికారిక నివాసంలో ప్రైవేట్‌గా డిన్నర్ ఇవ్వనున్నారు.
జీ 20 సమావేశాలు జరిగినన్ని రోజులు జో బైడెన్ ఢిల్లీలోని అత్యంత ఖరీదైన హోటల్ ఐటీసీ మౌర్య షెరటన్‌లో బస చేస్తారు. ఇందులో మొత్తం 400 గదులు వుంటాయి. బైడెన్ భద్రత దృష్ట్యా.. అమెరికన్ సీక్రెట్ సర్వీస్ ఈ హోటల్‌లోని అన్ని గదులను 3 రోజుల పాటు బుక్ చేసింది. మీడియా కథనాలను బట్టి బైడెన్ ఈ హోటల్‌లోని 14వ అంతస్తులో వుంటారు. ఇక్కడ సకల సౌకర్యాలు వున్న ప్రెసిడెన్షియల్ సూట్ ‘చాణక్య’లో బైడెన్ బస చేస్తారు. ఆయనను గ్రౌండ్ ఫ్లోర్ నుంచి తీసుకెళ్లడానికి సీక్రెట్ సర్వీస్ ప్రత్యేకంగా లిఫ్ట్‌ను ఏర్పాటు చేసింది.