న్యూఢిల్లీ:  అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దంపతులు   సోమవారం నాడు  సాయంత్రం ఆగ్రాకు చేరుకొన్నారు. ఆగ్రాలో ట్రంప్ దంపతులకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందిబెన్ పటెల్ పలువురు మంత్రులు ఘనంగా స్వాగతం పలికారు.

Aslo read:భారతీయ సినిమాలు గొప్పవి, సచిన్, కోహ్లీలు ఇక్కడివారే: ట్రంప్

ట్రంప్‌తో పాటు ఆయన కూతురు ఇవాంకా ట్రంప్ కూడ   ఆగ్రాకు చేరుకొన్నారు. ఇండియా టూరుకు వచ్చిన అమెరికా అధ్యక్షులు తాజ్ మహల్‌ను సందర్శించడం ఆనవాయితీగా వస్తోంది.

రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆగ్రాకు చేరుకొన్న  ట్రంప్ కుటుంబం ఆగ్రాలో తాజ్‌హల్‌ను సందర్శించారు. సుమారు గంటపాటు  తాజ్‌మహల్‌ వద్ద ట్రంప్ కుటుంబం గడిపింది.

సంప్రదాయరీతిలో కళాకారులు  ట్రంప్ దంపతులకు స్వాగతం పలికారు.  సంప్రదాయ కళారీతులకు ట్రంప్ కుటుంబసభ్యులు  సంతోషపడ్డారు. సంప్రదాయ కళాకారుల స్వాగతానికి ట్రంప్ చప్పట్లు కొడుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. తాజ్‌మళ్ వద్దకు  భార్య మెలానియా, కూతురు ఇవాంకా , అల్లుడితో కలిసి ట్రంప్ తాజ్ మహల్ ను సందర్శించారు. 

తాజ్‌మహల్ వద్దకు  భార్య మెలానియా, కూతురు ఇవాంకా , అల్లుడితో కలిసి ట్రంప్ తాజ్ మహల్ ను సందర్శించారు. తాజ్ మహల్ వద్ద ట్రంప్ దంపతులు పోటోలు దిగారు. తాజ్ మహల్ గురించిన విశేషాలను గైడ్ ట్రంప్ దంపతులకు వివరించారు. 

ఇవాంకా దంపతులు తాజ్ మహల్ వద్ద ఫోటోలు దిగారు. తాజ్ మహల్ గురించి ఇవాంకా దంపతులకు గైడ్ వివరించారు.అమెరికాకు చెందిన ఫోటో గ్రాఫర్లు కూడ తాజ్ మహల్ వద్ద  ట్రంప్ , ఇవాంకా దంపతులను ఫోటోలు దింపేందుకు పోటీ పడ్డారు.