అహ్మదాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  తన ప్రసంగంలో  భారతీయ సినిమాలు, క్రికెట్ తో పాటు పలు పండుగల గురించి ప్రస్తావించారు. అమెరికా అధ్యక్షుడిగా  బాధ్యతలు స్వీకరించిన తర్వాత  తొలిసారిగా ఇండియాకు వచ్చిన ట్రంప్ ఇండియా ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించారు.

Also read:భారత్ శక్తి సామర్థ్యాలు వెలకట్టలేనివి: మోడీపై ట్రంప్ ప్రశంసలు

సోమవారం నాడు  గుజరాత్ రాష్ట్రంలోని మొతేరా స్టేడియంలో నిర్వహించిన నమస్తే ట్రంప్ కార్యక్రమంలో  అమెరికా అధ్యక్షుడు ట్రంప్  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ట్రంప్‌కు స్వాగతం పలికారు.   ఆ తర్వాత  ట్రంప్  తన ప్రసంగంలో ఇండియాకు చెందిన పలువురి పేర్లను ప్రస్తావించారు. మోడీపై  పలు దఫాలు ట్రంప్  ప్రశంసలు కురిపించారు.

భారతీయ సినిమాల గురించి  ట్రంప్ ప్రస్తావించారు. ప్రతి ఏడాది  రెండు వేల సినిమాలను నిర్మిస్తారని అగ్రరాజ్యాధినేత చెప్పారు. తన ప్రసంగంలో డీడీఎల్ సినిమా గురించి  ప్రస్తావించారు.  భారతీయ చిత్రాల గొప్పదనాన్ని ఆయన అభినందించారు.

ఇండియాకు చెందిన డీడీఎల్, షోలే సినిమాలను ట్రంప్ ఈ సందర్భంగా నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ప్రస్తావించారు. మోడీ అమెరికా పర్యటన సమయంలో  టెక్సాస్ లోని  పుట్‌బాల్ స్టేడియంలో హౌడీ మోడీ కార్యక్రమాన్ని ఐదు మాసాల క్రితం నిర్వహించిన కార్యక్రమాన్ని ట్రంప్  గుర్తు చేశారు.

ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంలో తమకు ఆహ్వానం పలకడం ఎప్పటికీ మర్చిపోలేమన్నారు  ప్రపంచంలో మేటి క్రికెట్ ఆటగాళ్లైన సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీలను ఇండియా నుండి  ప్రపంచానికి అందించిందన్నారు. 

క్రికెటర్లు సచిన్, కోహ్లీల పేర్లను ప్రస్తావించగానే  సభికులు సంతోషంతో హర్షధ్వానాలు చేశారు. ఇక భారతీయులు జరుపుకొనే పండుగల గురించి కూడ ట్రంప్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. 

దీపావళి, హోళీ పండుగల గురించి  ట్రంప్ ప్రస్తావించారు. గత ఏడాది ట్రంప్ వైట్ హౌస్ లో   ట్రంప్ దీపావళి పండుగను జరుపుకొన్నాడు. దీపావళి, హోళీ పండుగల గురించి ట్రంప్ ప్రస్తావిస్తూ సంస్కృతి సంప్రదాయాలకు భారతీయులు ప్రాధాన్యత ఇస్తారని  ట్రంప్ చెప్పారు. వివేకానంద స్వామిని ట్రంప్ ప్రస్తావించారు.