Bhilwara: ప్ర‌భుత్వ పాఠశాల‌లో చదువుతున్న ఓ బాలిక వాటర్‌ బాటిల్‌లో ఒక వర్గానికి చెందిన కొందరు ఆక‌తాయి విద్యార్థులు మూత్రాన్ని కలిపారు. దీనిని గ‌మ‌నించ‌కుండా విద్యార్థిని అదే వాట‌ర్ ను తాగింది. దీంతో పాటు విద్యార్థిని బ్యాగ్ లో ప్రేమ‌లేఖ‌లు రాసి పెట్టారు. ఈ క్రమంలోనే బాధిత విద్యార్థిని స్కూల్ ప్రిన్సిప‌ల్ కు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేయ‌డంతో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.  

Urine Mixed In Girl Student's Water Bottle: ప్ర‌భుత్వ పాఠశాల‌లో చదువుతున్న ఓ బాలిక వాటర్‌ బాటిల్‌లో ఒక వర్గానికి చెందిన కొందరు ఆక‌తాయి విద్యార్థులు మూత్రాన్ని కలిపారు. దీనిని గ‌మ‌నించ‌కుండా విద్యార్థిని అదే వాట‌ర్ ను తాగింది. దీంతో పాటు విద్యార్థిని బ్యాగ్ లో ప్రేమ‌లేఖ‌లు రాసి పెట్టారు. బాధిత విద్యార్థిని స్కూల్ ప్రిన్సిప‌ల్ కు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేయ‌డంతో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఈ అనాగ‌రిక ఘ‌ట‌న రాజ‌స్థాన్ లో చోటుచేసుకుంది.

వివ‌రాల్లోకెళ్తే.. రాజస్థాన్ లోని భిల్వారా జిల్లాలోని ప్రభుత్వ సీనియర్ హయ్యర్ సెకండరీ స్కూల్ కు చెందిన ఓ విద్యార్థిని డ్రికింగ్ వాట‌ర్ బాటిల్ లో స‌హ విద్యార్థులు మూత్రం పోశారు. మూత్రం క‌లిపిన నీటిని విద్యార్థిని తాగింది. దీనికి తోడు బాలిక బ్యాగులో ప్రేమలేఖలు రాసి పెట్టారు. బాధిత బాలిక స్కూల్ ప్రిన్సిప‌ల్ కు ఫిర్యాదు చేయ‌డంతో ఈ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. ఈ అమానుష ఘ‌ట‌న‌పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుల ప్రాంతంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ కూడా చేశారు.

''గత శుక్రవారం లుహరియా గ్రామంలోని ప్రభుత్వ సీనియర్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని తన భోజన విరామ సమయంలో తన బ్యాగులో ఉంచిన వాటర్ బాటిల్ లో కొందరు బాలురు మూత్రం కలిపారని ఫిర్యాదు చేసింది. బాటిల్ నుంచి తాగిన తర్వాత దుర్వాసన రావడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె బ్యాగులో 'లవ్ యూ' అని రాసి ఉన్న లేఖ కూడా కనిపించింద‌ని'' అని పోలీసు అధికారి తెలిపారు.

ఫిర్యాదు చేసినా ప్రిన్సిపాల్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ప్రజలను ఆందోళనకు గురిచేసింది. సోమవారం పాఠశాల పునఃప్రారంభం కాగానే తహసీల్దార్, లుహరియా పోలీస్ స్టేషన్ ఇన్చార్జి, పాఠశాల ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లారు. అయినా సరైన చర్యలు తీసుకోకపోవడంతో నిందితులు నివసిస్తున్న ప్రాంతంలోకి ప్రవేశించ‌డానికి ప్ర‌య‌త్నించారు. ఈ క్ర‌మంలోనే అక్క‌డ ఉద్రిక్త‌త నెల‌కొంది. పోలీసులు రంగ‌ప్ర‌వేశం చేశారు.