న్యూఢిల్లీ:  సివిల్స్ పరీక్ష వాయిదా వేయాలన్న పిటిషన్ ను  సుప్రీంకోర్టు బుధవారం నాడు కొట్టివేసింది. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్ 4వ తేదీన యథాతథంగా జరగనుంది.

కోవిడ్ ప్రోటోకాల్ ను పాటిస్తూ పరీక్షలను నిర్వహించాలని సుప్రీంకోర్టు యూపీఎస్‌సీకి సూచించింది.కరోనా నేపథ్యంలో పరీక్షకు హాజరు కాకపోతే  మరోసారి అవకాశం కల్పించాలని యూపీఎస్‌సీకి సుప్రీంకోర్టు సూచించింది. ఇదే చివరిసారిగా ఐఎఎస్ పరీక్షలకు రాసేవారికి మాత్రమేనని సుప్రీంకోర్టు తెలిపింది.

2020, 2021 యూపీఎస్‌సీ ప్రిలిమ్స్ పరీక్షలను విలీనం చేయాలనే సూచనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.సివిల్స్ పరీక్షలను వాయిదా వేయాలని సుప్రీంకోర్టులో పలువురు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు బుధవారం నాడు ఈ తీర్పును వెలువరించింది.

ఈ ఏడాది పరీక్షలు వాయిదా వేస్తే వచ్చే ఏడాది కూడ పరీక్షలపై కూడ ప్రభావం చూపే అవకాశం ఉందని కూడ సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కరోనా నేపథ్యంలో ఈ పరీక్షలను వాయిదా వేయాలని పిటిషనర్లు కోరారు. అయితే సివిల్స్ రిక్రూట్ మెంట్ పై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున పరీక్షలు వాయిదా వేయాలని  పిటిషనర్లు కోరారు.