Asianet News TeluguAsianet News Telugu

కరోనా దెబ్బ: సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు వాయిదా

 కరోనాను పురస్కరించుకొని సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షలు-2020 వాయిదా వేసింది యూపీఎస్‌సీ. ఈ పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని  మే 20వ తేదీన ప్రకటించనున్నట్టుగా యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ ప్రకటించింది.

UPSC defers civil services preliminary exam scheduled on May 31
Author
New Delhi, First Published May 4, 2020, 5:45 PM IST

న్యూఢిల్లీ: కరోనాను పురస్కరించుకొని సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షలు-2020 వాయిదా వేసింది యూపీఎస్‌సీ. ఈ పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని  మే 20వ తేదీన ప్రకటించనున్నట్టుగా యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ ప్రకటించింది.

ఈ నెల 31వ తేదీన యూపీఎస్‌సీ 2020 ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఈ పరీక్షలకు సంబంధించి హాల్ టిక్కెట్లను జారీ చేయనున్నారు. ఈ పరీక్షలు రాసేందుకు వందలాది మంది అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారు. ఈ పరీక్షలు రాసేందుకు తెలుగు రాష్ట్రాల నుండి అభ్యర్థులు కూడ ఢిల్లీలో ఉన్నారు. 

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకుగాను కేంద్ర ప్రభుత్వం ఈ నెల 17వ తేదీ వరకు లాక్ డౌన్ విధించింది. లాక్ డౌన్ నేపథ్యంలో ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో కాంపిటిటీవ్ పరీక్షలను వాయిదా పడ్డాయి. సీబీఎస్ఈ వాయిదా వేసిన పరీక్షలను రద్దు చేసింది. 

also read:కరోనా చికిత్స: ఒక్కో రోగిపై రోజూ రూ. 25 వేల ఖర్చు

లాక్ డౌన్ నేపథ్యంలో  ఈ పరీక్షల షెడ్యూల్ ను మార్చాలని వచ్చిన వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకొన్నట్టుగా కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ తెలిపారు. పరీక్షల షెడ్యూల్ ను రీ షెడ్యూల్ చేస్తామని ప్రకటించారు. 

గతంతో పోలిస్తే ఈ ఏడాది సివిల్ సర్వీసెస్ పరీక్షల షెడ్యూల్ ముందుగానే ప్రారంభమైంది. కానీ కరోనా దెబ్బకు పరీక్షల షెడ్యూల్ ను రీ షెడ్యూల్ చేయాల్సి వచ్చింది. 

Follow Us:
Download App:
  • android
  • ios