యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ పరీక్షల షెడ్యూల్ ఇదీ

యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ పరీక్షల షెడ్యూల్ ను శుక్రవారం నాడు యూపీఎస్‌సీ విడుదల చేసింది. లాక్ డౌన్ నేపథ్యంలో నిర్ణీత షెడ్యూల్ ప్రకారంగా జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే.
 

UPSC Civil Services Exam 2020 revised dates released. Check new exam calender

న్యూఢిల్లీ:  యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ పరీక్షల షెడ్యూల్ ను శుక్రవారం నాడు యూపీఎస్‌సీ విడుదల చేసింది. లాక్ డౌన్ నేపథ్యంలో నిర్ణీత షెడ్యూల్ ప్రకారంగా జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే.

UPSC Civil Services Exam 2020 revised dates released. Check new exam calender

సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షలు ఈ ఏడాది అక్టోబర్ 4వ తేదీన నిర్వహించనున్నారు. మెయిన్స్ పరీక్షలను 2021 జనవరి 8వ తేదీన నిర్వహించనున్నారు.
ఇవాళ ప్రత్యేక సమావేశం నిర్వహించిన తర్వాత కొత్త తేదీలను యూపీఎస్‌సీ ప్రకటించింది. 

UPSC Civil Services Exam 2020 revised dates released. Check new exam calender

వాస్తవానికి ఈ ఏడాది మే 31వ తేదీన యూపీఎస్‌సీ ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే లాక్ డౌన్ నేపథ్యంలో అభ్యర్థుల నుండి వచ్చిన వినతి మేరకు ప్రిలిమినరీ పరీక్షలను వాయిదా వేశారు.

also read:కరోనా దెబ్బ: సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు వాయిదా

ఈ నెలాఖరు వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొంది. లాక్ డౌన్ పొడిగించినా కూడ పలు రంగాలపై ఆంక్షల్లో సడలింపులను ఇచ్చింది కేంద్రం.
ఈ నెల 8వ తేదీ నుండి మరిన్ని రంగాల్లో ఆంక్షలపై సడలింపులు ఇవ్వనుంది కేంద్ర ప్రభుత్వం.గత ఏడాది సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ, మెయిన్స్ ద్వారా ఎంపికైన అభ్యర్థుల వ్యక్తిత్వ పరీక్షలు ఈ ఏడాది జూలై 20 నుండి ప్రారంభం కానున్నాయి.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios