ఘజియాబాద్ జిమ్ ట్రైనర్‌కు హార్ట్ ఎటాక్.. కుర్చీలో కూర్చునే మరణం
ఘజియాబాద్ జిమ్ ట్రైనర్ కుర్చీలో కూర్చుంటూనే హార్ట్ ఎటాక్‌కు గురయ్యారు. హాస్పిటల్ తీసుకెళ్లేలోపే మరణించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు అయింది.
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఓ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలోకి వచ్చింది. అందులో ఓ జిమ్ ట్రైనర్ మరణించిన విధం ఉన్నది. కుర్చీలో కూర్చునే అసలు ఏ మాత్రం అనుమానమే రాకుండా తుది శ్వాస విడిచాడు. ఈ ఘటన ఘజియాబాద్‌లో సాయంత్రం 7 గంటలకు చోటుచేసుకుంది. ఈ ఘటన సీసీటీవీ ఫుటేజీల బయటపడింది.
మృతుడిని 33 ఏళ్ల ఆదిల్‌గా గుర్తించారు. ఆయన ఒక జిమ్ ట్రైనర్. ఆదిల్ మిత్రులు వెంటనే ఆయనను సమీప హాస్పిటల్ తీసుకెళ్లారు. కానీ, హాస్పిటల్ వెళ్లేలోపే మరణించాడు. ఘజియాబాద్‌లో షాలిమార్ గార్డెన్ ఏరియాలో ఆయనకు ఒక జిమ్ ఉన్నది. అక్కడే ఆయన కూడా రోజూ ఎక్సర్‌సైజ్ చేసేవాడు.
కొన్ని రోజులుగా తనకు జ్వరం వస్తున్నదని ఆదిల్ చెప్పినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. కానీ, జిమ్ పోవడం మాత్రం ఆపలేదని వివరించారు. ఆదిల్‌కు నలుగురు పిల్లలు ఉన్నారు. ఆయన హఠాన్మరణంపై ఖంగుతిన్నది.
Also Read: బిజీ లైఫ్ స్టైల్ లో గుండె ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసా?
ఆయన ఇటీవలే రియల్ ఎస్టేట్ బిజినెస్‌లోకి వెళ్లాడు. షాలిమార్ గార్డెన్ లోనే కొత్త ఆఫీస్ ఓపెన్ చేశాడు. ఆయన తన ఆఫీసు కు వెళ్లాడు. ఆఫీసు లో చైర్‌లో కూర్చున్నాడు. కుర్చీలో కూర్చున్న తర్వాతే ఆయనకు హార్ట్ ఎటాక్ వచ్చింది. అక్కడి నుంచి హాస్పిటల్‌కు తీసుకెళ్లుతుండగా మార్గం మధ్యలోనే మరణించాడు.
ఇలాంటి హఠాన్మరణం ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇటీవలే ముంబయిలో నవరాత్రి వేడుకల్లో గార్బా ఆడుతూనే 35 ఏళ్ల వ్యక్తి మరణించాడు.