లాక్ డౌన్: హాస్పిటల్ కి వెళ్లడానికి వాహనం లేక నిండు గర్భిణీ..
ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ నేపథ్యంలో.. వాహనాలు ఏమీ అందుబాటులో లేవు. దీంతో సదరు మహిళను ఆమె భర్త సైకిల్ పై కూర్చోపెట్టి ఆస్పత్రికి తీసుకువెళ్లడానికి బయలు దేరాడు.
దేశంలో ప్రస్తుతం కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా.. గర్భిణీ స్త్రీ.. నడి రోడ్డుపైనే బిడ్డకు జన్మనించింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
Also Read ఆ వార్తతో నాకు సంబంధం లేదు.. రతన్ టాటా వివరణ...
పూర్తి వివరాల్లోకి వెళితే...ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షాహమజాన్ పూర్ ప్రాంతానికి చెందిన ఓ నిండు గర్భిణీకి ఏప్రిల్ 9వ తేదీ సాయంత్రం నొప్పులు రావడం మొదలయ్యాయి. ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ నేపథ్యంలో.. వాహనాలు ఏమీ అందుబాటులో లేవు. దీంతో సదరు మహిళను ఆమె భర్త సైకిల్ పై కూర్చోపెట్టి ఆస్పత్రికి తీసుకువెళ్లడానికి బయలు దేరాడు.
వాళ్లు ఉన్న ప్రాంతం నుంచి ఆస్పత్రికి దాదాపు 10కిలోమీటర్ల దూరం ఉండటం గమనార్హం. సైకిల్ పైనే దాదాపు ఆ దంపతులు ఐదు కిలోమీటర్ల మేర వెళ్లారు. కాగా.. ఆ తర్వాత మహిళకు నొప్పులు మరింత ఎక్కువయ్యాయి. దీంతో.. సదరు మహిళ రోడ్డుపైనే ప్రసవించింది. ఆమెకు ఆడపిల్ల జన్మించిందని అధికారులు తెలిపారు.
కాగా..వారిని గమనించిన పోలీసులు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారని పోలీసులు చెప్పారు.