దేశంలో మహిళలకు రక్షణ కరువైందనడానికి ఇదో ఉదాహరణ. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు, శిక్షలు తీసుకువచ్చినా... నేరం చేయాలి అనుకున్నవాళ్లను మాత్రం అవి ఏమాత్రం బయటపెట్టడం లేదు. ఇలాంటి దుర్మార్గుల అరాచకానికి తల్లీ, కూతుళ్లు బలయ్యారు. 

 మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. వాళ్లు నేరం చేసినట్లు రుజువు కావడంతో.. జైలుకు వెళ్లారు. జైలుకి వెళ్లినా వారిలో మార్పు రాలేదు.. బెయిల్ పై బయటకు వచ్చి... బాలిక, ఆమె తల్లిని మరోసారి వేధించారు. ఆ తర్వాత సమయంలో చూసుకొని.. బాలిక తల్లిని అతి దారుణంగా కొట్టి చంపేశారు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. 

పూర్తి వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ కి  చెందిన మైనర్ బాలికను ఆరుగురు వ్యక్తులు లైంగికంగా వేధించారు. దీంతో... బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు అబిద్, మింటు, మెహబూబ్, చాంద్ బాబు, జమాయిల్, ఫిరోజ్ లకు 2018 కోర్టు శిక్ష కూడా విధించింది. కాగా... నిందితులు ఇటీవల బెయిల్ పై బయటకు వచ్చారు.

Also Read తలపై మూడు గన్ షాట్స్: 7 కిమీ కారు డ్రైవ్ చేసిన మహిళ...

బయటకు వచ్చిన ఆరుగురు నిందితుల్లో నలుగురు సదరు బాలిక, ఆమె తల్లిని బెదిరించారు. కేసు వెనక్కి తీసుకోవాలని లేకపోతే చంపేస్తామని బెదిరించారు. అయితే.... బాలిక కుటుంబసభ్యులు కేసు వెనక్కి తీసుకోవడానికి అంగీకరించలేదు. దీంతో... వారికి బాగా కోపం వచ్చింది.

ఆ కోపంలో బాలిక తల్లిని, మరో మహిళపై దారుణంగా ప్రవర్తించారు. కాళ్లతో తంతూ ఆమెకు చిత్రహింసలు పెట్టారు. వారి దాడి అనంతరం ఇరువురు మహిళలను ఆస్పత్రిలో చేర్పించగా బాలిక తల్లి కన్నుమూసింది.

కాగా... సదరు మహిళపై దాడికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ గా మారింది. కొన్ని సెకన్లు మాత్రమే ఉన్న ఆ వీడియోలో.. ఎరుపు రంగు పంజాబీ డ్రెస్ వేసుకున్న మహిళను.. తెలుపు రంగు కుర్తా వేసుకున్న ఓ వ్యక్తి కాలితో తంతున్నట్లుగా ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.