Asianet News TeluguAsianet News Telugu

స్కూల్ బిల్డింగ్‌పై నుంచి రెండో తరగతి పిల్లాడిని తలక్రిందులుగా వేలాడదీసిన హెడ్‌మాస్టర్

పిల్లలకు బుద్ధి చెప్పడానికి, అదుపులో పెట్టడానికి ఆ ఉపాధ్యాయుడు ఎంచుకున్న మార్గం వివాదాస్పదంగా మారింది. పిల్లలను కొరికాడని, సోను యాదవ్ అనే రెండో తరగతి విద్యార్థిని భయపెట్టాలని భావించి యూపీకి చెందిన ఓ స్కూల్ హెడ్ మాస్టర్ చిక్కులను కొనితెచ్చుకున్నాడు. స్కూల్ పై అంతస్తుకు తీసుకెళ్లి కాలు పట్టుకుని పిల్లాడిని తలక్రిందులుగా వేలడదీశాడు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. హెడ్ మాస్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
 

UP school head master arrested for dangling student
Author
Lucknow, First Published Oct 29, 2021, 4:03 PM IST

లక్నో: ఉత్తరప్రదేశ్ మిర్జాపూర్‌లో అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంది. పిల్లలకు క్రమశిక్షణ నేర్పాల్సిన గురువు హద్దుమీరి ప్రవర్తించాడు. రెండో తరగతి పిల్లాడికి భయం చెప్పాలని ఏకంగా School బిల్డింగ్ పైకి తీసుకువెళ్లి తలక్రిందులుగా వేలాడదదీశారు. ఓ కాలు పట్టుకుని బాలుడిని తలక్రిందులుగా వేలాడదీస్తుంటే ఒకరు ఆ ఘటనను ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఫొటోతో వెలుగులోకి వచ్చిన Head Master తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది.

Uttar Pradeshలోని Mirzapurలో ఓ స్కూల్ హెడ్‌మాస్టర్‌గా మనోజ్ విశ్వకర్మ పనిచేస్తున్నారు. సోను యాదవ్ అనే రెండో తరగతి పిల్లాడు తమను కొరికాడని ఓ విద్యార్థి హెడ్‌మాస్టర్ మనోజ్ విశ్వకర్మకు ఫిర్యాదు ఇచ్చారు. మంగళవారం లంచ్ బ్రేక్ సమయంలో పిల్లలాంత బయట ఆడుకోవడానికి వెళ్లారు. ఆటలాడుకుంటుండగానే సోను యాదవ్ తమను కొరికాడని ఆరోపించారు. దీంతో మనోజ్ విశ్వకర్మ పిల్లాడిపై తీసుకున్న చర్యలు వివాదాస్పదమయ్యాయి.

మళ్లీ అలా కొరకకుంటా బుద్ధి చెప్పాలనుకున్న హెడ్ మాస్టర్ మనోజ్ విశ్వకర్మ Class రూమ్ నుంచి పిల్లాడిని గుంజుకెళ్లాడు. స్కూల్ టాప్ ఫ్లోర్ వరకు తీసుకెళ్లాడు. అక్కడి నుంచి పిల్లాడిని ఎత్తుకుని ఓ కాలు పట్టుకుని తలక్రిందులుగా వేలాడదీశారు. పిల్లాడు ఒక్కసారిగా ఏడుపు లంకించుకున్నాడు. భయంతో బెంబేలెత్తుతూ వణికిపోయాడు. సారీ చెప్పు సారీ చెప్పు అంటూ హెడ్ మాస్టర్ మనోజ్ విశ్వకర్మ అడిగాడు. సారీ చెప్పకుంటే అక్కడి నుంచి పిల్లాడిని వదిలిపెడ్తాననీ భయపెట్టాడు.

Also Read: గుంటూరు: తరగతి గదిలోనే చిన్నారులకు నీలిచిత్రాలు చూపించి... నీచపు టీచర్ వికృతచేష్టలు

పిల్లాడి కేకలతో తరగతి గదుల్లోని పిల్లలంతా అక్కడికి చేరుకున్నారు. పిల్లలంతా గుమిగూడుతూ అక్కడికి రావడాన్ని హెడ్ మాస్టర్ చూశాడు. ఆ తర్వాత పిల్లాడిని పైనకు తీసుకుని విడిచిపెట్టాడు.

ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పిల్లాడు చేసింది తప్పే అయినా, హెడ్ మాస్టర్ అలా చేసి ఉండకూడదని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇదిలా ఉండగా ఆ పిల్లాడి తండ్రి మాత్రం ఇందుకు విరుద్ధంగా మాట్లాడటం గమనార్హం.

హెడ్ మాస్టర్ మనొజ్ విశ్వకర్రమ తన కొడుకును తలక్రిందులుగా వేలాడదీయడం తప్పే అయినా ఆయనేమీ ప్రతీకారంతో చేయలేదు కదా అని తండ్రి అన్నారు. తన కొడుకు సోనూ యాదవ్‌పై ప్రేమతోనే, వాడిని దారిలో పెట్టాలనే అలా చేశాడు కదా అని అభిప్రాయపడ్డారు. తన కొడుకును వేలాడదీసినందుకు తానేమీ అభ్యంతర పెట్టకపోవడం మరో చర్చను లేవదీసింది. 

Also Read: ఇద్దరు విద్యార్థులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో వైన్ షాప్ తరలించాలని ఆదేశాలు.. ఎక్కడంటే..

జువైనెల్ జస్టిస్ యాక్ట్ కింద హెడ్ మాస్టర్ మనోజ్ విశ్వకర్మను Policeలు అరెస్టు చేశారు. ఆ పిల్లాడిపై తాను అంతలా రియాక్ట్ కాకపోయేవాడినని, కానీ, సోను యాదవ్ తండ్రే పిల్లాడిని గాడిలో పెట్టాలని కోరాడని మనోజ్ విశ్వకర్మ తెలిపారు.

సోను యాదవ్ ఎక్కువ అల్లరి చేస్తుంటాడని, పిల్లలనే కాదు.. ఉపాధ్యాయులనూ కొరికి పరుగెత్తుతుంటాడని మనోజ్ విశ్వకర్మ అన్నారు. అందుకే పిల్లాడిని సరైన దారిలో పెట్టాలని తండ్రే తనను కోరాడని వివరించారు. అందుకే పిల్లాడిని భయపెట్టాలని భావించానని చెప్పారు. భయపెట్టడానికే పిల్లాడిని పై అంతస్తు నుంచి తలక్రిందులుగా వేలాడదీశానని తెలిపారు. విషయాన్ని కనుగొని హెడ్ మాస్టర్‌ను అరెస్టు చేసిన పోలీసులపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios