భారీ వర్షాలు ఉత్తరప్రదేశ్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. భారీగా పోటెత్తిన వరదలతో జనజీవనం స్తంభించిపోయింది. వర్షాల కారణంగా మూడు రోజుల్లోనే 60 మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు
భారీ వర్షాలు ఉత్తరప్రదేశ్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. భారీగా పోటెత్తిన వరదలతో జనజీవనం స్తంభించిపోయింది. వర్షాల కారణంగా మూడు రోజుల్లోనే 60 మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. యూపీ వ్యాప్తంగా 31 జిల్లాల్లో 60 మంది చనిపోగా...53 మంది క్షతగాత్రులయ్యారు.. ఇల్లు కూలిపోవడం, వరదల్లో చిక్కుకుపోవడం, పిడుగులు తదితర కారణాలతో మరణాలు ఎక్కువగా చనిపోతున్నారు.
అత్యధికంగా సహరన్‌పూర్ జిల్లాలో 11 మంది, మీరట్‌లో 10 మంది, ఆగ్రాలో ఆరుగురు చనిపోయినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 26 నుంచి నేటి వరకు వర్షాల కారణంగా మరణించిన వారి జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. వీరందరిని ఆదుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
కాగా, వరద ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సచివాలయం నుంచి ఆయన ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
