Asianet News TeluguAsianet News Telugu

UP polls 2022: బీజేపీ ప్రభుత్వంపై అఖిలేష్ యాదవ్ విమర్శలు..!

 ఉత్తరప్రదేశ్‌లో త్వరలో జరగనున్న ఎన్నికల కోసం తమ పార్టీ మరిన్ని పార్టీలతో పొత్తు పెట్టుకోబోతోందని అన్నారు. తాము అధికారంలోకి  వచ్చిన తర్వాత.. ప్రజల సమస్యలను పరిగణలోకి తీసుకొని.. పరిష్కరిస్తామని చెప్పారు.
 

UP polls 2022: Akhilesh Yadav promises caste census if Samajwadi Party voted to power
Author
Hyderabad, First Published Nov 12, 2021, 12:18 PM IST

ఉత్తరప్రదేశ్ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. 2022లో ఈ ఎన్నికలు జరగనున్నాయి.  కాగా... ఎన్నికల హీట్ ఇప్పటినుంచే వేడెక్కుతోంది.  కాగా.. వచ్చే ఏడాది జరగనున్న ఈ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే.. వెనకపడిన వర్గాల కోసం కుల గణనను నిర్వహిస్తామని సమాజ్ వాద్ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ హామీ ఇచ్చారు.

Also read:పెద్ద శత్రువు పాక్ కాదు, చైనానే.. మనకు అమెరికా, రష్యా రెండూ కావాలి.. సీడీఎస్ బిపిన్ రావత్

వెనుకబడిన వర్గాల కోసం కుల గణన చేపట్టాలని బీజేపీ ప్రభుత్వం కోరుకోవడం లేదని, అధికారంలోకి వస్తే మీ కోసం చేస్తామని హామీ ఇస్తున్నామని ఆయన అన్నారు. ముజఫర్‌నగర్ జిల్లాలో జరిగిన బహిరంగ ర్యాలీలో మాజీ ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ, ఉత్తరప్రదేశ్‌లో త్వరలో జరగనున్న ఎన్నికల కోసం తమ పార్టీ మరిన్ని పార్టీలతో పొత్తు పెట్టుకోబోతోందని అన్నారు. తాము అధికారంలోకి  వచ్చిన తర్వాత.. ప్రజల సమస్యలను పరిగణలోకి తీసుకొని.. పరిష్కరిస్తామని చెప్పారు.

Also Read: కశ్మీర్‌లో థర్డ్ వేవ్? హాట్‌స్పాట్‌గా శ్రీనగర్.. పెరుగుతున్న కరోనా కేసులు

కాగా.. రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలోనూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ పై అఖిలేష్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి.. రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగానే ఉన్నాయని చెబుతున్నారని.. కానీ.. అమాయకులు ఎలా హత్యకు గురయ్యారో తాను ఉదాహరణలతో చెప్పగలను అని అఖిలేష్ పేర్కొన్నారు. ఇటీవల ఓ యువకుడిని పోలీసులు ఎత్తుకెళ్లి కొట్టి చంపేశారని ఆయన మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వ హయాంలోనే అత్యధిక కస్టడీ డెత్ లు జరిగాయని ఆయన చెప్పారు.

ఇదిలా ఉండగా... అఖిలేష్ యాదవ్.. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్  నుంచి "సమాజ్‌వాదీ విజయ రథయాత్ర"ని ప్రారంభించడం ద్వారా తన పార్టీ "మిషన్ 2022"ని ప్రారంభించారు. ఈ యాత్ర 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మొత్తం 403 అసెంబ్లీ సెగ్మెంట్లను కవర్ చేస్తుంది . మొదటి దశలో కాన్పూర్, కాన్పూర్ దేహత్, హమీర్పూర్ , జలౌన్ మీదుగా యాత్ర సాగుతుంది. బిజెపి ప్రభుత్వ "అవినీతి, నిరంకుశ , అణచివేత" విధానాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తామని  "నిజమైన ప్రజాస్వామ్యం" స్థాపిస్తామని  సమాజ్ వాద్ పార్టీ హామీ ఇచ్చింది.

Follow Us:
Download App:
  • android
  • ios