లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో మైనర్ బాలికపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడి సజీవ దహనం చేశారు. ఈ ఘటనకు బాధ్యులుగా భావించిన ఏడుగురిపై పోలీసులుకేసు నమోదు చేసినా వారిని అరెస్ట్ చేయలేదు. .నిందితులను కఠినంగా శిక్షించాలని  దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్‌లోని ఇటుకబట్టీలో ఓ దళిత కుటుంబం  పనిచేస్తోంది. ఈ దంపతులు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లారు. ఇటుక బట్టీల వద్దే ఈ కుటుంబం నివాసం ఉండేది. 

ఇటుక బట్టీల వద్ద ఉన్న గదిలోనే దళిత బాలికపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడి సజీవ దహనం చేశారు దుండగులు. ఇటుక బట్టీ యజమానితో పాటు మరో ఆరుగురు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 

ఈ ఘటనకు పాల్పడిన ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ, అరెస్ట్ చేయలేదు. దీంతో దళిత సంఘాలు పోలీసుల తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగాయి.