Asianet News TeluguAsianet News Telugu

యూపీ మంత్రి నంద్ గోపాల్ నందికి ఏడాది జైలు శిక్ష.. ఎందుకంటే ?

2014 సంవత్సరంలో నమోదైన ఓ కేసులో ఉత్తరప్రదేశ్ మంత్రి నంద్ గోపాల్ నందికి కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. ఎన్నికల సమయంలో ఆయన సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలపై దాడి చేశాడని కోర్టు పేర్కొంది. 

 

UP Minister Nand Gopal Nandi was sentenced to a year in jail.. because?
Author
First Published Jan 25, 2023, 5:18 PM IST

ఉత్తరప్రదేశ్ మంత్రి నంద్ గోపాల్ నందికి ఏడాదికి జైలు శిక్ష ఖరారు అయ్యింది. 2014 ఎన్నికల ర్యాలీలో ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలపై దాడి చేసిన కేసులో ప్రయాగ్‌రాజ్ జిల్లా కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. రేవతి రమణ్ సింగ్ ప్రసంగిస్తున్న బహిరంగ సభలో అప్పటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నంద్ గోపాల్ గుప్తా నంది సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలపై దాడి చేశారు.

బీజేపీకి ఒడిశా మాజీ సీఎం గిరిధ‌ర్ గ‌మాంగ్ రాజీనామా.. త్వ‌ర‌లో బీఆర్ఎస్ లోకి.. !

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుపై అప్పటి నుంచి కోర్టులో విచారణ జరగుతోంది. తాజాగా ప్రత్యేక ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు ఐపీసీ సెక్షన్లు 147, 323 కింద అల్లర్లు, స్వచ్ఛందంగా గాయపర్చారని పేర్కొంటూ అతడిని దోషిగా తేల్చింది. అయితే తాజా కోర్టు తీర్పు తరువాత నందికి బెయిల్ మంజూరైంది. కాబట్టి ఆయన పై కోర్టులో అప్పీలు చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే మంత్రి జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios