లక్నో:అద్దె చెల్లించలేదనే కోపంతో దంపతులను కాల్చి చంపాడు ఓ ఇంటి యజమాని ఈ దారుణ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది. 

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఆజంఘర్ జిల్లాలోని అహిరౌలాకు చెందిన సంజీవ్ అనే వ్యక్తి కొత్వాలి సిటీలో ఆటో విడిబాగాలు అమ్మే దుకాణాన్ని నడుపుతున్నాడు. అక్కడే రాకేష్ రాయ్ అనే వ్యక్తి ఇంటిని అద్దెకు తీసుకొని నివసిస్తున్నాడు. 

లాక్ డౌన్ కారణంగా రెండు మాసాలుగా ఆయన దుకాణం తెరవలేదు. దీంతో చేతిలో చిల్లిగవ్వ లేదు. అయితే దీంతో ఆయన ఇంటి అద్దె చెల్లించలేకపోయాడు. దీంతో ఆదివారం నాడు రాత్రి ఇంటి యజమాని తనకు అద్దె చెల్లించాలని రాయ్ కోరాడు. లాక్ డౌన్ కారణంగా తన వద్ద డబ్బులు లేవని సంజీవ్ ఇంటి యజమానికి చెప్పాడు. 

అద్దె విషయమై ఇద్దరి మధ్య కొద్దిసేపు గొడవ పడ్డారు. ఈ సమయంలో ఆగ్రహానికి గురైన రాయ్ తుపాకితో సంజయ్ తో పాటు ఆయన భార్యపై కాల్పులు జరిపాడు. దీంతో వారిద్దరూ అక్కడే కుప్పకూలిపోయారు. 

also read:కరోనా ఎఫెక్ట్: ఒడిశాలో నరబలి చేసిన పూజారి, అరెస్ట్

తుపాకీ పేలిన చప్పుడుతో స్థానికులు అక్కడికి చేరుకొని చూసే సరికి భార్యాభర్తలు రక్తపు మడుగులో ఉన్నారు.  వారిని ఆసుపత్రికి తరలించారు.  ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భార్యాభర్తలు ఆసుపత్రిలోనే మరణించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.