మల విసర్జన చేస్తుండగా పాము పొట్టలోకి వెళ్లిందని హాస్పిటల్‌కు పరుగు.. వైద్యులు ఏమన్నారంటే?
యూపీకి చెందిన ఓ వ్యక్తి రాత్రిపూట బహిరంగంగా మల విసర్జన చేస్తుండగా ఓ పాము తన ప్రైవేట్ పార్టు గుండా కడుపులోకి వెళ్లిందని ఆరోపించాడు. అందుకే తన కడుపు తీవ్రంగా నొప్పి పెడుతున్నదని తెలిపాడు. ఈ వింత కేసుతో వైద్యులు కూడా షాక్ అవుతున్నారు.
లక్నో: ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి వింత సమస్యతో హాస్పిటల్‌కు వచ్చాడు. ఆయన బహిరంగంగా మల విసర్జన చేస్తున్నప్పుడు ఓ పాము తన ప్రైవేట్ పార్టులో నుంచి పొట్టలోకి చొచ్చుకెళ్లిందని, అందుకే తనకు తీవ్రంగా కడుపు నొప్పి వస్తున్నదని వైద్యులకు తెలిపాడు. ఈ ఫిర్యాదుతో డాక్టర్లు సైతం ఖంగుతిన్నారు. వెంటనే అందరూ అలర్ట్ అయ్యారు. పరీక్షలు చేశారు. అనంతరం, వైద్యులు ఊపిరిపీల్చుకున్నారు. అలాంటిదేమీ లేదని ఆ వ్యక్తికి చెప్పారు. కానీ, వారు నమ్మలేదు. మరో హాస్పిటల్‌కు రిఫర్ చేయాలని కోరారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
ఉత్తరప్రదేశ్‌లో హర్దోయ్ జిల్లాకు చెందిన మహేంద్ర రాత్రిపూట బహిరంగంగా మల విసర్జన చేయడానికి వెళ్లాడు. కడుపు నొప్పితో ఇంటికి వచ్చాడు. తన పొట్టలోకి పాము చొచ్చుకెళ్లిందని చెబుతాడు. ఆ కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను హర్దోయ్ మెడికల్ కాలేజీ ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్‌కు అర్ధరాత్రి వెళతారు. తన ప్రైవేట్ పార్టు గుండా పొట్టలోకి పాము వెళ్లిందని చెప్పగానే.. ఆ వింత కేసుకు వైద్యులంతా ఆశ్చర్యపడతారు. వెంటనే అటెన్షన్ లభిస్తుంది. అందరూ ఆ పేషెంట్ చుట్టూ చేరతారు. అనంతరం, పరీక్షలు చేస్తారు. కానీ, ఆయన బాడీలో పాము లేదా.. బయటి ఇతర వస్తువు లేదా జీవి లేదని తేలుస్తారు.
Also Read: తెలంగాణలో షాపులు, రెస్టారెంట్లు 24 గంటలు తెరిచి ఉంచుకోవచ్చు.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
మెడికల్ సిబ్బంది అలాంటిదేమీ లేదని స్పష్టం చెప్పినా.. మహేంద్ర కుటుంబ సభ్యులు సెకండ్ ఒపీనియన్ కోసం మరో హాస్పిటల్‌కు రిఫర్ చేయాలని కోరారు.
ఆ వ్యక్తిని తీక్షణంగా పరిశీలించి, వైద్య సిబ్బంది పరీక్షలు చేశారు. తాగిన మత్తులో ఆ వ్యక్తి అలా భ్రమపడ్డాడని తెలిపారు. ఉదయం పూట హాస్పిటల్ నుంచి మహేంద్రను డిశ్చార్జీ చేశారు.
డాక్టర్ షేర్ సింగ్ మాట్లాడుతూ.. ‘ఆ వ్యక్తి డ్రగ్స్ మత్తులో ఉన్నట్టు కనిపిస్తున్నది. అప్పుడప్పుడు తనకు పొట్ట నొస్తుందని చెప్పాడు. అది కూడా డ్రగ్స్ వల్లే పొట్ట నొస్తున్నది. కానీ, తనకు కొడుపు నొస్తున్నదని, పాము లోనకు వెళ్లిందని కుటుంబ సభ్యులకు మహేంద్ర తెలిపాడు. అదే నిజమని ఆ కుటుంబం వెంటనే హాస్పిట్లకు తీసుకెళ్లారు. మరుసటి రోజు ఉదయం తీసిన సీటీ స్కాన్ చూస్తే ఆయన బాడీలో ఏ అబ్‌నార్మాలిటీ లేదని తెలిపారు.