Asianet News TeluguAsianet News Telugu

ఓ వైపు అంత్యక్రియలు .. మరోవైపు బతికే ఉన్నాడని కబురు..  

గుర్తుకు తెలియని మృతదేహాన్ని చూసి తమ కొడుకేనని అంత్యక్రియలకు నిర్వహిస్తుండగా.. మరోచోట సజీవంగా బతికే ఉన్నాడని తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న ఆ యువకుడి కుటుంబ సభ్యులతోపాటు పోలీసులు షాక్‌ అయ్యారు. వెంటనే అంత్యక్రియలను నిలిపివేసి.. ఆ మృతదేహాన్ని పోలీసులకు అప్పగించారు.

UP man found alive in Chandigarh just before cremation KRJ
Author
First Published Sep 15, 2023, 10:48 PM IST

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడి అంత్యక్రియలకు సన్నాహాలు జరుగుతుండగా.. మరో చోట ఆ వ్యక్తి బతికే ఉన్నాడని తెలిసింది. దీంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. అంత్యక్రియలు చేయడమేంటీ? బతికి రావడమేంటని భావిస్తున్నారా?  ఈ అంశంపై క్లారిటీ రావాలంటే.. ఈ సోర్టీని చదివేయండి. 

వివరాల్లోకెళ్తే.. ముజఫర్‌నగర్‌కు చెందిన మాంటీ కుమార్ (20) అనే యువకుడు, అదే ప్రాంతానికి చెందిన యువతి కలిసి ఇంటి నుంచి పారిపోయారు. తమ కుమార్తెను మాంటీ కుమార్ కిడ్నాప్ చేసినట్లు యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆ జంటను వెతికేందుకు పోలీస్ బృదాలను ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యులు, పోలీసులు కలిసి వెతికినా.. ఫలితం లేకుండా పోయింది. దొరుకుతాడనే ఆశ కూడా పూర్తి పోయింది.

ఈ క్రమంలో సెప్టెంబర్ 9న మీరట్‌లోని దౌరాలా ప్రాంతంలో శిరచ్ఛేదం చేయబడిన మృతదేహం (తల లేని శవం) లభ్యమైంది. శవంలో పలు భాగాలు కూడా మిస్సయ్యాయి. మీరట్ పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాల్లోని పోలీసు స్టేషన్లకు సమాచారం అందించారు. ఈ క్రమంలో ముజఫర్‌నగర్ పోలీసులు ఆ మృతదేహాన్ని గమనించారు. మన్సూర్‌పూర్‌లో నివసిస్తున్న మాంటీ కుమార్ కుటుంబీకులకు చెప్పాడు. ఆ శవం తమ కుమారుడిదేనా? అని గుర్తించాలని మాంటీ కుమార్ తల్లిదండ్రులకు కోరారు.  

మాంటీ కుమార్ కుటుంబీకులు మీరట్ మార్చురీకి చేరుకుని గుర్తించారు. మాంటీ కుమార్  ఉన్నట్టు గానే.. ఆ  మృతదేహాం మెడ, చేతులపై పచ్చబొట్లు ఉన్నాయి. అయితే శరీరం యొక్క రెండు భాగాలు కనిపించలేదు. అటువంటి పరిస్థితిలో.. హంతకులు మృతదేహాన్ని గుర్తించకుండా ఇలా చేశారని భావించారు.

ఈ క్రమంలో బుధవారం రాత్రి మృతదేహంతో ముజఫర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద నిరసనకు దిగారు. యువతి కుటుంబ సభ్యులు తమ కుమారుడ్ని హత్య చేసినట్లు ఆరోపించారు. చర్చల తరువాత కుటుంబ సభ్యులు మృతదేహాన్ని దహన సంస్కారాలకు సన్నాహాలు ప్రారంభించారు.

మరోవైపు మాంటీ కుమార్ , ఆ యువతి చండీగఢ్‌లో ఉన్నట్లు ముజఫర్‌నగర్‌ పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని అతడి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దీంతో కుమారుడిదిగా భావించిన మృతదేహానికి అంత్యక్రియలను మాంటీ కుమార్ కుటుంబ సభ్యులు నిలిపివేశారు. అయితే తల లేని ఆ మృతదేహం మాంటీ కుమార్ గా తల్లిదండ్రులు ఎందుకు పొరపడ్డారు? ఇంతకీ ఆ శవం ఎవరిది?  అన్నదానిపై మీరట్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios