అమ్మవారి ఆరాధన అయిన దసరా పండుగ నాడు ఒళ్ల జలదరించే సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఉత్తరప్రదేశ్ లో ఓ వ్యక్తి నాలుకకోసుకోగా, మరో వ్యక్తి గొంతు కోసుకున్నాడు. ఈ రెండు సంఘటనల్లోనూ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికే వీరిద్దరూ చేయడం కొస మెరుపు. వివరాల్లోకి వెడితే..

ఉత్తరప్రదేశ్ లోని బాబేరు ప్రాంతంలో ఉన్న భాటి గ్రామ ఆలయంలో 22 ఏళ్ల యువకుడు తన నాలుక కోసుకున్నాడు. ఆత్మారామ్ అనే 22 ఏళ్ల యువకుడు ఆలయానికి వచ్చి తన నాలుకను కత్తిరించి దేవుడికి నైవేద్యంగా సమర్పించాడని పోలీసులు చెప్పారు. 

అది చూసిన ఆలయంలోని భక్తులు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. తీవ్ర రక్తస్రావమైన ఆత్మారాంను ఆసుపత్రికి తరలించామని, అతని పరిస్థితి స్థిరంగా ఉందని పోలీసులు చెప్పారు. అయితే ఆత్మారాంకు మతిస్థిమితం సరిగా లేదని, అందుకే నవరాత్రి సందర్భంగా నాలుక కోసుకున్నాడని ఆత్మారాం తండ్రి చెప్పారు. 

యూపీలోనే జరిగిన మరో ఘటనలో కురారా ప్రాంతంలోని శివాలయంలో 49 ఏళ్ల రుక్మిణి మిశ్రా కోకేశ్వర్ ఆలయంలో కత్తితో గొంతు కోసుకున్నాడు. తీవ్రంగా గాయపడిన రుక్మిణి మిశ్రాను ఆసుపత్రికి తరలించారు. 

అయితే వీరిద్దరూ మూఢనమ్మకాలతోనే దేవుడు ప్రసన్నం అవుతాడనే ఈ చర్యలకు పాల్పడ్డారని జిల్లా ఎస్పీ తెలిపారు.