యువతకు శుభవార్త : కేబినెట్ బేటీలో యోగి సర్కార్ నిర్ణయాలివే

ఉత్తర ప్రదేశ్ యువతకు, రైతాంగానికి మేలు చేసేలా యోగి కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా జరిగిన మంత్రిమండలి సమావేశంలో పలు పథకాలకు ఆమోదం తెలిపారు. 

UP Govt Launches Mukhyamantri Yuva Udyami Vikas Abhiyan Scheme for Youth Self-Employment AKP

లక్నో : యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశ్యంతో 'ముఖ్యమంత్రి యువ ఉద్యమి వికాస్ అభియాన్' (ముఖ్యమంత్రి యువ) పథకాన్ని అమలు చేయాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఎంఎస్ఎంఈ రంగం యొక్క కీలక పాత్రను దృష్టిలో ఉంచుకుని ఈ పథకాన్ని ప్రారంభించారు. మంత్రివర్గ సమావేశంలో మొత్తం 25 ప్రతిపాదనలకు ఆమోదం లభించింది.

 లక్ష మంది విద్యావంతులకు ఆర్థిక సాయం 

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, ఖాదీ, గ్రామీణ పరిశ్రమలు, సిల్క్, చేనేత వంటి వస్త్ర పరిశ్రమల గురించి మంత్రి రాకేష్ సచాన్ మాట్లాడుతూ... ఈ పథకం ద్వారా రాబోయే 10 సంవత్సరాలలో 10 లక్షల సూక్ష్మ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీని ద్వారా రాష్ట్రంలోని లక్ష మంది విద్యావంతులు, శిక్షణ పొందిన యువతకు ప్రతి సంవత్సరం ఆర్థిక సహాయం అందించబడుతుందని తెలిపారు.

రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి కల్పించడమే ఈ పథకం లక్ష్యం. ఇందుకోసం దరఖాస్తు చేయాలనుకునేవారు కనీసం 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి, అయితే ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన దరఖాస్తుదారులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అంతేకాకుండా దరఖాస్తుదారు వివిధ ప్రభుత్వ పథకాల కింద శిక్షణ పొంది ఉండాలి... అవి విశ్వకర్మ శ్రామ్ సమ్మాన్ యోజన, ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకం, షెడ్యూల్డ్ కులాలు లేదా తెగల శిక్షణ పథకాలు, ఉత్తరప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి మిషన్ నిర్వహిస్తున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు.

రూ.5 లక్షల వరకు ప్రాజెక్టులకు రాయితీ

ఈ పథకం కింద సూక్ష్మ పరిశ్రమలు, సేవా రంగంలో 5 లక్షల రూపాయల వరకు ఉన్న ప్రాజెక్టులకు రుణంపై రాయితీ అందించబడుతుందని మంత్రి సచాన్ తెలిపారు. ప్రాజెక్ట్ వ్యయం 10 లక్షల రూపాయల వరకు ఉంటే, మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారుడు స్వయంగా భరించాల్సి ఉంటుంది. సాధారణ వర్గాలకు చెందిన లబ్ధిదారులు ప్రాజెక్ట్ వ్యయంలో 15 శాతం, ఇతర వెనుకబడిన వర్గాలకు చెందిన లబ్ధిదారులు 12.5 శాతం, షెడ్యూల్డ్ కులాలు, తెగలు, దివ్యాంగులకు చెందిన లబ్ధిదారులు 10 శాతం సొంత వాటాగా చెల్లించాల్సి ఉంటుంది.

అయితే బుందేల్‌ఖండ్, పూర్వాంచల్, చిత్రకూట్, చందౌలి, సోన్‌భద్ర, ఫతేపూర్, బల్లారాంపూర్, సిద్ధార్థనగర్, శ్రావస్తి, బహ్రైచ్ వంటి జిల్లాల లబ్ధిదారులకు  ఈ పథకంలో ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. ఈ ప్రాంతాలకు చెందిన లబ్ధిదారులు కూడా ప్రాజెక్ట్ వ్యయంలో 10 శాతం సొంత వాటాగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకం కింద రుణంపై 4 సంవత్సరాల పాటు వంద శాతం వడ్డీ రాయితీ అందించబడుతుంది, రుణం తీసుకున్న తేదీ నుండి 6 నెలల మారటోరియం వ్యవధి కూడా లభిస్తుంది.

రెండవ దశలో 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం

ఈ పథకం కింద మొదటిసారి లబ్ధి పొందిన యువత రెండవ దశకు కూడా అర్హులు. ఇక్కడ వారికి గరిష్టంగా 10 లక్షల రూపాయల వరకు ఉన్న ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించబడుతుంది. డిజిటల్ లావాదేవీలను కూడా ఈ పథకంలో ప్రోత్సహించారు, దీని కింద ప్రతి లావాదేవీకి 1 రూపాయి, సంవత్సరానికి గరిష్టంగా 2000 రూపాయల అదనపు రాయితీ కూడా ఇవ్వబడుతుంది.

రైతుల ఆదాయాన్ని పెంచేందుకు యూపీ అగ్రిస్ పథకం

రైతుల ఆదాయాన్ని పెంచడానికి యోగి ప్రభుత్వం మరో కీలకమైన ప్రతిపాదన యూపీ అగ్రిస్‌కు కూడా ఆమోదం తెలిపింది. వ్యవసాయ మంత్రి సూర్య ప్రతాప్ షాహి ఈ పథకం గురించి మాట్లాడుతూ... యూపీలో 9 వాతావరణ మండలాలు ఉన్నాయని తెలిపారు. ఇందులో బుందేల్‌ఖండ్, ఈశాన్య ప్రాంతాల్లో ఉత్పాదకత పశ్చిమ ప్రాంతం కంటే తక్కువగా ఉందని చెప్పారు. అటువంటి పరిస్థితిలో తక్కువ  ఉత్పాదకత ప్రాంతాలపై ప్రభుత్వం దృష్టిపెట్టిందని తెలిపారు. 

బుందేల్ ఖండ్ వంటి ప్రాంతాల్లో ఉత్పాదకత పెంచడం, ఆవిష్కరణలు, ఆర్థిక వృద్ధితో సహా వివిధ ప్రక్రియల ద్వారా ప్రయోజనం చేకూర్చడం లక్ష్యంగా పెట్టుకుంది యోగి సర్కార్. అందువల్లే యూపీ అగ్రీస్ పథకాన్ని తీసుకువచ్చి28 జిల్లాల్లో అమలు చేస్తున్నారు. ఝాన్సీ, చిత్రకూట్, గోరఖ్‌పూర్, వారణాసి, అజామ్‌గఢ్, బస్తీ, దేవీపట్నం డివిజన్లలోని జిల్లాల్లో ఈ ప్రాజెక్ట్ అమలు చేయబడుతుంది. 

ఈ ప్రాజెక్ట్ ద్వారా రైతులు, రైతు సంఘాలు, వ్యవసాయ పరిశ్రమలను ఆహార శుద్ధితో సహా వివిధ ప్రాజెక్టులతో అనుసంధానిస్తారు. ఈ ప్రాజెక్ట్ కోసం 4000 కోట్ల రూపాయలను కేటాయించారు... ఆరు సంవత్సరాలపాటు దీన్ని అమలు చేస్తున్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం పదకొండు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు ఇస్తుంది... మిగతా 2737 కోట్ల రూపాయలు  ప్రపంచ బ్యాంకు పెట్టుబడి పెడుతుంది. రుణ తిరిగి చెల్లింపు వ్యవధి యాభై సంవత్సరాలు,వడ్డీ రేటు 1.23 శాతం ఉంటుంది.

ఉన్నత విద్య అభివృద్ధికి ప్రోత్సాహకాలు

రాష్ట్రంలో ఉన్నత విద్య రంగాన్ని బలోపేతం చేయడం, యువతకు నాణ్యమైన విద్యను అందించే ఉద్దేశ్యంతో యోగి ప్రభుత్వం 'ఉత్తరప్రదేశ్ ఉన్నత విద్య ప్రోత్సాహక విధానం  2024'ని అమలు చేసింది. ఉన్నత విద్యా శాఖ మంత్రి యోగేంద్ర ఉపాధ్యాయ్ మాట్లాడుతూ... ఈ విధానం రాష్ట్రంలో పెరుగుతున్న ఉన్నత విద్య అవసరాలను తీర్చడానికి, ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహిస్తుందని చెప్పారు. దీని ద్వారా విద్యార్థులు రాష్ట్రంలోనే ఉన్నత నాణ్యత గల విద్యను పొందే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలోని యువతకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా  ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని తెలిపారు.

ఈ విధానం కింద స్పాన్సరింగ్ సంస్థలకు స్టాంప్ డ్యూటీలో మినహాయింపు, మూలధన రాయితీ, ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించబడతాయి. అంతేకాకుండా NIRF ర్యాంకింగ్‌లో టాప్ 50లో చోటు దక్కించుకున్న విశ్వవిద్యాలయాలకు అదనపు ప్రోత్సాహకాలు కూడా అందించబడతాయి. మథుర, మీరట్‌లలో రెండు కొత్త ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలకు కూడా మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించింది. మథురలో కెడి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి 'రాజీవ్ మెమోరియల్ అకాడెమిక్ వెల్ఫేర్ సొసైటీ'కి అనుమతి పత్రం జారీ చేశారు. అదేవిధంగా మీరట్‌లో విద్యా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి 'విద్యా బల్ మండలి' 42.755 ఎకరాల స్థలంలో ప్రతిపాదనను సమర్పించింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios