Asianet News TeluguAsianet News Telugu

ముంబైలో ఇళ్ల మధ్యే కుప్పకూలిన విమానం: ఐదుగురు మృతి

ముంబైలో కుప్పకూలిన యూపీ చార్టెడ్ ఫ్లైట్

UP Government Chartered Plane Crashes In Mumbai Suburb,4 Feared Dead


  ముంబై: ముంబై ఘట్కోవర్ లో ఇళ్ల మధ్య  గురువారం నాడు యూపీ ప్రభుత్వానికి చెందిన  చార్టెడ్ ఫ్లైట్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. 

బీచ్‌క్రాఫ్ట్ కింగ్ ఎయిర్ సీ 90 రకానికి చెందిన విమనం ముంబైలోని ఘట్కోవర్ ప్రాంతంలోని నిర్మాణంలోని భవనం పక్కనే కుప్పకూలింది. దీంతో అక్కడ పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి.

జుహూ ఎయిర్‌పోర్ట్ ప్రాంతంలో ల్యాండవుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ఘటనలో పైలెట్‌తో పాటు మరో ముగ్గురు మృతి చెందారు.  అయితే విమానం కుప్పకూలిన ఘటనలో ఓ బాటసారి కూడ మృత్యువాత పడ్డారు.

 

యూపీ ప్రభుత్వానికి చెందిన ఈ ఫ్లైట్  కొద్ది రోజుల క్రితం ప్రమాదానికి గురైంది. ఈ విమానానికి రిపేర్ చేసిన తర్వాత పరీక్ష చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొందని సమాచారం. ఈ విమానం ల్యాండవుతుండగా కుప్పకూలిందని ప్రత్యక్ష సాక్లులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు..

ఆ విమానం మాది కాదు: యూపీ సర్కార్

 

ముంబైలో కుప్పకూలిన చార్టర్డ్ విమానం తమది కాదని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. ఇది యూపీ విమానమే అంటూ వచ్చిన వార్తలపై ఉత్తర ప్రదేవ్ ప్రిన్సిపల్ సెక్రటరీ   స్పందించారు. ఆ విమానాన్ని ముంబైకి చెందిన యూవై ఏవియేషన్‌కి అమ్మేసినట్టు ఆయన ప్రకటించారు.ఆ విమానం అలహాబాద్‌లో ఓ యాక్సిడెంట్‌కు గురైన తర్వాత దాన్ని అమ్మేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా ఆయన గుర్తు చేశారు.
 
బీచ్‌క్రాఫ్ట్ కింగ్ ఎయిర్ సీ 90 రకానికి చెందిన ఈ విమానం 1995లో యూపీ ప్రభుత్వం చేతికి అందినట్టు సమాచారం. యూపీ ప్రభుత్వం నుంచి దీన్ని యూవై ఏవియేషన్‌ 2014లో కొనుగోలు చేసింది. మొత్తం 10 మంది కూర్చునేలా ఇందులో సీటింగ్ సామర్థ్యం ఉంది.

 ఇవాళ మధ్యాహ్నం ముంబై ఎయిర్‌పోర్టు డొమెస్టిక్ టెర్మినల్ వైపు వెళుతూ ఈ విమానం కూలిపోయిన సంగతి తెలిసిందే. ముంబైలోని అత్యంత రద్దీగా ఉండే ఘట్కోపూర్‌‌లో నిర్మాణంలో ఉన్న ఓ భవంతిపై కూలిపోవడంతో ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios