యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీలు రకరకాల విన్యాసాలు చేస్తున్నాయి. భారీ హామీలను గుప్పిస్తూ జనాన్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా సమాజ్ వాదీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సరికొత్త డిమాండ్ ను తెరపైకి తీసుకొచ్చారు.

యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీలు రకరకాల విన్యాసాలు చేస్తున్నాయి. భారీ హామీలను గుప్పిస్తూ జనాన్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా సమాజ్ వాదీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సరికొత్త డిమాండ్ ను తెరపైకి తీసుకొచ్చారు. దివంగత మాజీ ప్రధాని చౌధరీ చరణ్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా చరణ్ సింగ్ జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకుంటారని గుర్తుచేశారు. రైతుల కోసం సర్వస్వాన్ని అర్పించిన వ్యక్తి చరణ్ సింగ్ అని అఖిలేశ్ యాదవ్ చెప్పారు.

ఇకపోతే.. అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) కుటుంబంలో కరోనా (Coronavirus) కలకలం రేపింది. ఆయన సతీమణి మాజీ ఎంపీ డింపుల్ యాదవ్ (Dimple Yadav), కుమర్తెకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. అఖిలేష్ యాదవ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. బుధవారం రాత్రి అఖిలేష్ యాదవ్‌తో యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) ఫోన్‌లో మాట్లాడినట్టుగా యూపీ ముఖ్యమంత్రి కార్యాలయం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. అఖిలేష్ కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆకాంక్షించారని పేర్కొంది. 

ఇక, భార్య‌, కూతురుకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో అఖిలేష్ యాదవ్ కూడా పరీక్షలు చేయించుకున్నారు. అయితే ఆయనకు నెగటివ్‌ వచ్చినట్టుగా సమాజ్‌వాదీ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో ఉన్న అఖిలేష్‌కు కరోనా నెగిటివ్‌గా నిర్దారణ కావడంతో పార్టీ శ్రేణులు ఉపిరి పీల్చుకున్నారు. 

బుధవారం తనకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయిన విషయాన్ని డింపుల్ యాదవ్ ట్వీట్ ద్వారా వెల్లడించారు. ‘నేను కోవిడ్ పరీక్షలు చేయించుకోగా.. అందులో పాజిటివ్‌గా నిర్దారణ అయంది. నేను వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకన్నాను. నాకు ఎలాంటి లక్షణాలు లేవు. నా భద్రతతో పాటుగా, ఇతరుల భద్రత కోసం నేను స్వీయ ఐసోలేషన్‌లో ఉన్నాను. ఇటీవల నన్ను కలిసిన వారంతా వెంటనే కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలని’ డింపుల్ యాదవ్ అభ్యర్థించారు.