Asianet News TeluguAsianet News Telugu

కూతురి వద్ద ప్రెగ్నెన్సీ టెస్ట్‌ కిట్లు, గర్భ నిరోధక మాత్రలు.. గొంతు కోసి దారుణంగా హత్య చేసిన తల్లిదండ్రులు..

కన్నకూతురుని తల్లిదండ్రులు గొంతుకోసి హత్య చేశారు. ఆమె ఆచూకీ తెలియకుండా ముఖంపై యాసిడ్‌ పోసి, మృతదేహాన్ని కాలువలో పడేశారు.ఆ తర్వాత తమ కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులకు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.ఈ  విషాదకర ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబిలో చోటు చేసుకుంది.  

UP Couple Kills Daughter, 21, After Finding Pregnancy Test Kits With Her
Author
First Published Feb 8, 2023, 11:02 PM IST

ఉత్తరప్రదేశ్ లో దారుణ హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులే కన్న కూతురిని అత్యంత దారుణంగా హత్య చేసి.. గుర్తుపట్టకుండా ముఖంపై యాసిడ్ పోసి అడవిలో పడేశారు. ఆపై..తమ కూతురు కనిపించడం లేదంటూ పోలీసులను ఆశ్రయించి.. మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశారు. ఈ విషాదకర ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబిలో జరిగింది.  

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 3న అలమాబాద్‌కు చెందిన నరేశ్‌.. తన కూతురు కనిపించడం లేదంటూ పోలీసులను ఆశ్రయించి.. మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే గ్రామ శివారులో ఉన్న కాలువలో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఓ యువతి మృతదేహాన్ని పోలీసులు కనుగొని మంగళవారం స్వాధీనం చేసుకున్నారు.

అయితే.. ఈ క్రమంలో తల్లిదండ్రుల వ్యవహర శైలిలో అనుమానం రావడంతో పోలీసులు తమదైన శైలి విచారణ చేశారు. అప్పడు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అది  పరువు హత్య అని తేల్చారు. బాధిత బాలికను కన్న తల్లిదండ్రులు ఇద్దరు కలిసి కండువాతో గొంతు కోసి చంపారు. అమ్మాయి పెళ్లి కాకుండానే ఓ అబ్బాయితో గర్భం దాల్చిందని, ఇంట్లో ప్రెగ్నెన్సీ కిట్, గర్భనిరోధక మాత్రలు కూడా లభ్యమయ్యాయని తెలిపారు. ఆ తర్వాత దంపతులిద్దరూ కలిసి పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు చేసినట్టు పోలీసులు దర్యాప్తులో తేలింది.  

నేరాన్ని అంగీకరించిన తల్లిదండ్రులు

పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించినప్పుడు, కుటుంబ సభ్యులు హత్యగా అనుమానించబడ్డారు, ఆ తర్వాత పోలీసులు కస్టడీలో ఉన్న అమ్మాయి తండ్రి రామ్ నరేష్‌ను కఠినంగా విచారించారు, దీంతో అతను తన నేరాన్ని అంగీకరించాడు. తన కూతురు ఒకరితో అక్రమ సంబంధం పెట్టుకుందని, దాని వల్లే ఆమె గర్భం దాల్చిందని చెప్పాడు. సమాజంలో తన గౌరవం పోతుందనే తన భార్యతో కలిసి కూతురిని గొంతుకోసి హత్య చేసినట్టు అంగీకరించాడు. అనంతరం తన సోదరులు గులాబ్, రమేష్‌లతో కలిసి మృతదేహాన్ని కాలువలోకి తీసుకెళ్లి విసిరేశాడు. నిషా తన గుర్తింపును దాచేందుకు ఆమె శరీరంపై బ్యాటరీ యాసిడ్ కూడా పోసినట్టు తెలిపారు. ఈ కేసులో రాంనరేష్, అతని భార్య, అతని ఇద్దరు సోదరులపై పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. ఈ పరువు హత్య ఘటన ఆ ప్రాంతమంతా కలకలం రేపింది.

తదుపరి చట్టపరమైన చర్యలు

నలుగురు నిందితులు తమ నేరాన్ని అంగీకరించారని పోలీసు సూపరింటెండెంట్ బ్రిజేష్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. ఇందులో చట్టపరమైన చర్యలను ప్రారంభించినట్టు తెలిపారు. బాలిక పలువురితో మొబైల్‌ ఫోన్‌లో మాట్లాడిందనే విషయంపై విచారణ జరుపుతున్నామని, అయితే ఘటనకు గల కారణాలను ఆమె తండ్రి అంగీకరించారని తెలిపారు. బాలిక ప్రవర్తనను మార్చుకోవాలని తండ్రి పలుమార్లు హెచ్చరించినట్టు గుర్తించారు. కానీ కుమార్తె అంగీకరించలేదు.

Follow Us:
Download App:
  • android
  • ios