ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ పోలీసు కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. లఖింపూర్ ఖేరికి చెందిన వివేక్ వర్మ తన సర్వీస్ రివాల్వర్‌తో షూట్ చేసుకుని మరణించాడు. 

లక్నో: ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ కానిస్టేబుల్ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలే మరణించినట్టు సూసైడ్ లెటర్‌లో రాసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 

23 ఏళ్ల వివేక్ వర్మ 2020 బ్యాచ్ కానిస్టేబుల్. లఖింపూర్ ఖేరి నివాసి. ప్రస్తుతం ఆయనకు పోలీసు లైన్‌లో పోస్టింగ్ ఇచ్చిన ఎస్పీ కేశవ్ కుమార్ చెప్పారు. వివేక్ హర్మ డెహత్ పోలీసు స్టేషన్ ఏరియాలోని ఛోటా దుసాహ్ లొకాలిటీలో అద్దెకు ఉంటున్నారు. ఆయన శనివారం విధులకు రాకపోవడంతో పోలీసు సిబ్బందిని ఆయన ఇంటికి పంపారు. 

వివేక్ వర్మ అద్దెకు ఉంటున్న గది తలుపు లోపలి వైపు నుంచి మూసే ఉన్నది. దాన్ని ఓపెన్ చేయగతా.. వివేక్ వర్మ రక్తపు మడుగులో కనిపించాడని ఎస్పీ ఆదివారం తెలిపారు. వివేక్ వర్మ సర్వీస్ ఎస్ఎల్ఆర్ రైఫిల్‌తో కాల్చుకున్నాడు. ఆ రైఫిల్ అతని పక్కనే కనిపించింది. 

పోలీసులు వివేక్ వర్మ డెడ్ బాడీ దగ్గర ఓ సూసైడ్ నోట్‌ను కూడా కనుగొన్నారు. అందులో వివేక్ వర్మ తన చావుకు ఓ కుటుంబ కలహమే కారణమని పేర్కొన్నాడని అధికారులు తెలిపారు.

Also Read: సెక్స్ రాకెట్‌లో ఇద్దరు హీరోయిన్‌ల పట్టివేత.. వ్యభిచారం నిర్వహిస్తున్న ఏజెంట్ల అరెస్టు

వివేక్ వర్మ మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం హాస్పిటల్‌కు తరలించారు. వివేక్ వర్మ కుటుం బానికి ఈ విషయం తెలియ జేశారు. ఈ కేసు విచారణను చేపడుతున్నట్టు ఆ అధికారి వివరించారు.