Asianet News TeluguAsianet News Telugu

సెక్స్ రాకెట్‌లో ఇద్దరు హీరోయిన్‌ల పట్టివేత.. వ్యభిచారం నిర్వహిస్తున్న ఏజెంట్ల అరెస్టు

మహారాష్ట్రలో పోలీసులు ఓ సెక్స్ రాకెట్‌ గుట్టురట్టు చేశారు. పూణెలోని వకడ్ జిల్లాలో ఫైవ్ స్టార్ హోటల్‌లో హీరోయిన్‌లతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు సమాచారం అందుకుని రైడ్ చేశారు. ఇందులో ఇద్దరు (మోడల్స్, హీరోయిన్లుగా ఉన్న) మహిళలను కాపాడరు. ముగ్గురు ఏజెంట్లను అరెస్టు చేశారు.
 

maharashtra police bust sex racket, saves actresse kms
Author
First Published May 14, 2023, 5:54 PM IST

ముంబయి: విలాసవంతమైన హోటల్‌లో కొన్ని కదలికలు అనుమానం కలిగించాయి. అక్కడ అసాంఘిక చర్యలు జరుగుతున్నాయనే అనుమానాలతో పోలీసులు నిఘా పెంచారు. పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని విటులకు మోడల్, హీరోయిన్‌లను అందుబాటులో ఉంచుతున్నట్టు తెలుసుకున్నారు. దీని నిర్దారణ కోసం పోలీసులే ఒకరిని విటుడిగా పంపించారు. ఆ విటుడి సమాచారంతో నిర్దారించుకున్న పోలీసులు ఆ హోటల్ పై దాడి చేశారు. వ్యభిచారంలో చిక్కుకున్న ఇద్దరు భోజ్‌పూరి హీరోయిన్లను రక్షించారు. ఆ ప్రాస్టిట్యూషన్ రాకెట్‌ను నడుపుతున్న ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణెలో చోటుచేసుకుంది.

పూణెలోని వకడ్ జిల్లా పోలీసు స్టేషన్ ఇన్వెస్టిగేషన్ అధికారి దేవన్ చవాన్ అందించిన వివరాల ప్రకారం, ఆ ఫైవ్ స్టార్ హోటల్‌లో కస్టమర్లను ఎంటర్‌టెయిన్ చేయడానికి హీరోయిన్లు, మోడల్స్‌ను తీసుకువస్తున్నట్టు సమాచారం వచ్చింది. ఆ హోటల్‌లో క్రైం బ్రాంచ్ పోలీసులు ఓ ట్రాప్ సెట్ చేశారు.

భోజ్‌పూరి హీరోయిన్లు, మోడల్స్‌ను ప్రలోభపెట్టి, మోసం చేసి వ్యభిచార కూపంలోకి దింపుతున్నట్టు తమకు సమాచారం వచ్చిందని చవాన్ తెలిపారు. అక్కడ కస్టమర్లను ఎంటర్‌టెయిన్ చేయడానికి వీరిని ఉపయోగించుకున్నట్టు తెలిసిందని వివరించారు. నైట్ సర్వీస్‌కు రూ. 25 వేలు, మధ్యాహ్నం సెషన్ అయితే రూ. 15 వేలు కస్టమర్ల నుంచి చార్జ్ చేస్తున్నట్టు తెలుసుకున్నారు.

Also Read: అయోధ్యలో హిందు ప్రాబల్య వార్డులో స్వతంత్ర ముస్లిం అభ్యర్థి గెలుపు.. స్థానికులు ఏమంటున్నారంటే?

ఈ సమాచారం వచ్చిన తర్వాత శుక్రవారం రాత్రి పోలీసులు ఆ హోటల్‌లో రైడ్ చేశారు. అప్పుడు ఇద్దరు మహిళలను పట్టుకున్నారు. అయితే, ఆ హీరోయిన్ పేరును వెల్లడించడానికి నిరాకరించారు.

సమాచారం అందగానే క్రైం బ్రాంచ్ ఆపరేటివ్‌లను ఫేక్ క్లయింట్‌లుగా ఆ హోటల్‌లోకి పంపించారు. వారు ప్రాస్టిట్యూషన్ నిర్వహిస్తున్న వారికి ఆన్‌లైన్‌లో మెసేజీ చేశారు. ఆ ఏజెంట్లు వారికి యాక్ట్రెస్ - మోడల్ ఫొటోలనూ పంపించారు. వారి కోసం హోటల్ రూమ్ కూడా బుక్ చేశారు.

ఆ ఆపరేటివ్‌లు హోటల్‌లోకి వెళ్లి పంపిన సమాచారంతో క్రైం బ్రాంచ్ రైడ్ చేశారు. ఇద్దరు మహిళలను కాపాడటంతో పాటు ముగ్గురు ఏజెంట్లు ప్రబీర్ పీ మజుందార్, దినేశ్ యాదవ్, విరాజ్ యాదవ్‌లుగా గుర్తించారు. ఈ ముగ్గురే ఆ ఇద్దరు మహిళలను వ్యభిచారంలోకి దింపినట్టు భావిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios