ఫ్రాన్స్ రాయబారితో సీఎం యోగి భేటీ ... యూపీలో పెట్టుబడులపై చర్చ

ఫ్రాన్స్ రాయబారి డాక్టర్ థియరీ మాథుతో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో భేటీ అయ్యారు. రక్షణ, ఫార్మా, విద్యారంగాల్లో పెట్టుబడులపై వీరు చర్చించారు.  

UP CM Yogi Meets French Ambassador to Discuss Investment Opportunities AKP

లక్నో : ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో ఫ్రాన్స్ రాయబారి డాక్టర్ థియరీ మాథు భేటీ అయ్యారు. ఆయనతో పాటు ఫ్రాన్స్ ప్రతినిధి బృందం కూడా ఉంది. నిన్న(సోమవారం) ముఖ్యమంత్రిని కలిసిన ప్రతినిధి బృందం యూపీలో రక్షణ, ఫార్మా, విద్యారంగాల్లో పెట్టుబడులు, ఒప్పందాలపై విస్తృతంగా చర్చించింది. యూపీలో పెట్టుబడులకు అన్ని విధాల సహకరిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

యూపీలో పెట్టుబడులకు సీఎం యోగి ఆహ్వానం

ఫ్రెంచ్ కంపెనీలను ఎన్‌సీఆర్, బుందేల్‌ఖండ్‌తో పాటు రక్షణ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి ఆహ్వానించారు. భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్‌లో 60 శాతం యువత ఉన్నందున పెట్టుబడులకు అనుకూలంగా ఉందని ప్రతినిధి బృందం ఆసక్తి చూపించింది.

ఉత్తరప్రదేశ్, ఫ్రాన్స్ మధ్య వ్యాపార, సాంస్కృతిక భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించుకోవాలని మాథు కోరుకున్నారు. ఐటీ కారిడార్, స్మార్ట్ సిటీలు, సాంస్కృతిక అభివృద్ధిలో కూడా ఉత్తరప్రదేశ్‌తో కలిసి పనిచేయడానికి ప్రతినిధి బృందం ఆసక్తి చూపించింది.

విద్య, సంస్కృతి, వ్యాపార రంగాల్లో సహకారం 

ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడం, పెట్టుబడులను పెంచడం, పునరుత్పాదక ఇంధనం పై యూపీ సీఎం, ప్రెంచ్ ప్రతినిధుల మధ్య చర్చ జరిగింది.  ఉత్తరప్రదేశ్‌లో ఫ్రెంచ్ కంపెనీలను విస్తరించడంపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. భారతదేశపు ప్రాచీన సంస్కృతి, చరిత్రపై ఫ్రాన్స్‌లో జరుగుతున్న అధ్యయనాల గురించి మాథు ప్రస్తావించారు. వారణాసిలోని సంపూర్ణానంద్ విశ్వవిద్యాలయంలో భద్రపరచబడిన ప్రాచీన వ్రాతప్రతులు, చారిత్రక పత్రాల ప్రాముఖ్యతను ముఖ్యమంత్రి వివరించారు. 

విద్య, సంస్కృతి, వ్యాపార రంగాల్లో సహకారాన్ని పెంచుకోవడంపై ఇరువర్గాలు అంగీకరించాయి. రక్షణ రంగంలో సహకారం, జేవర్ విమానాశ్రయంలో ఎంఆర్‌ఓ (నిర్వహణ, మరమ్మతు, పర్యవేక్షణ) హబ్ ఏర్పాటు, బుందేల్‌ఖండ్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ (బిడా) ఫార్మా పార్క్‌లో పెట్టుబడి అవకాశాలపై కూడా ముఖ్యమంత్రి దృష్టి సారించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios