సంజయ్ దత్ మద్దతు కోరిన యోగి..

First Published 9, Jun 2018, 1:22 PM IST
up cm yogi adityanath meets sanjay dutt
Highlights

సంజయ్ దత్ మద్దతు కోరిన యోగి..

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌ను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కలిశారు. ఈ సందర్భంగా బీజేపీ చేపట్టిన సంపర్క్ ఫర్ సమర్థన్ ప్రచార కార్యక్రమానికి మద్ధతు ఇవ్వాల్సిందిగా సీఎం.. సంజయ్‌ను కోరారు.. 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు మోడీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాలు తదితర వివరాలను యోగి ఆదిత్యనాథ్‌.. సంజూకు వివరించారు.. 

సంపర్క్ ఫర్ సమర్థన్:
2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. ముందుగానే లక్ష్యాన్ని నిర్దేశించుకున్న భారతీయ జనతా పార్టీ ఇప్పటి నుంచే శ్రేణులను సమాయత్తం చేస్తోంది. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా సంపర్క్ ఫర్ సమర్థన్ (మద్ధతు కోసం భేటీ)ని ప్రారంభించింది. దీనిలో భాగంగా పార్టీ జాతీయాధ్యక్షుడు, ప్రధాని, కేంద్రమంత్రులు సహా బీజేపీకి చెందిన సుమారు 4000 మంది నేతలు.. వివిధ రంగాల్లో అగ్రస్ధానాల్లో ఉన్న సుమారు లక్ష మంది ప్రముఖులను కలిసి వారికి పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు.. ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలను తెలిపి.. వారి మద్ధతును కోరుతారు.. దీనిలో భాగంగానే యూపీ సీఎం ఇవాళ సంజయ్ దత్ ను కలిశారు.

loader