Ram Mandir: అయోధ్యలో రామమందిర గర్భగుడి నిర్మాణానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన కార్యక్రమంలో గ‌ర్భ‌గుడి పూజ నిర్వహించి, రాళ్లపై సిమెంట్ పోశారు. విజ‌యవంతంగా ఆల‌య నిర్మాణ జ‌రగాల‌ని సీఎం యోగి ఆశించారు.   

Ram Mandir: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అయోధ్య‌లో రామ మందిర నిర్మాణం మ‌రో కీల‌క ఘ‌ట్టం ప్రారంభమైంది. రెండ‌వ ద‌శ ప‌నుల్లో భాగంగా నేడు రామ మందిర గ‌ర్భ‌గుడి నిర్మాణ‌ పనుల‌ను ప్రారంభ‌మ‌య్యాయి. ఇందులో భాగంగా ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్య‌నాథ్ బుధ‌వారం గ‌ర్భ‌గుడికి శంకుస్థాప‌న పూజ నిర్వహించారు. ఈ మందిరాన్ని మూడు ద‌శ‌ల్లో నిర్మించ‌నున్నారు. తొలి ద‌శలో రామ మందిర నిర్మాణంలో భాగంగా ఫ్లాట్‌ఫామ్‌ను నిర్మించారు. తాజాగా రెండ‌వ ద‌శ ప‌నుల్లో భాగంగా గ‌ర్భ‌గృహాన్ని నిర్మించ‌ద‌లిచారు. ఇందులో భాగంగానే నేడు సీఎం యోగి శంకుస్థాప‌న పూజ నిర్వహించి, రాళ్లపై సిమెంట్ పోశారు.

ఈ శంకుస్థాప‌న‌ కార్యక్రమానికి హాజరయ్యే ముందు సీఎం యోగి అయోధ్యలోని హనుమాన్ గర్హి ఆలయంలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. రామ మందిర గ‌ర్భ గుడి శంకుస్థాప‌న‌.. కీల‌క‌ మైలురాయి అని అభివ‌ర్ణించారు. శంకుస్థాపన చేసిన అనంతరం యోగి ఆదిత్యనాథ్ విలేకరులతో మాట్లాడుతూ.. 'అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులను ప్రధాని మోదీ దాదాపు 2 ఏళ్ల క్రితం ప్రారంభించారు. పనులు విజయవంతంగా కొనసాగుతున్నాయని, ఆ నిర్మాణ ప‌నుల‌ను నిర్వహించడం మా అదృష్టం. గర్భగుడి నిర్మాణం నేడు ప్రారంభించారు. అని అన్నారు. 

ఈ సందర్భంగా ఆచార్య రాఘవాచార్య మాట్లాడుతూ.. ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు.. రామమందిరి నిర్మాణాన్ని చూడ‌టం చాలా సంతోషంగా ఉంది. 2022 జూన్ 4 వరకు 'ప్రాణ్ ప్రతిష్ఠ' కార్యక్రమం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.

అనంతరం. అయోధ్య రామమందిర నిర్మాణ కమిటీ అధ్యక్షుడు నృపేంద్ర మిశ్రా మాట్లాడుతూ.. ఆల‌య నిర్మాణంలో కీల‌క‌మైన ప‌నుల‌ను ఇవాళ ప్రారంభిస్తున్న‌ట్లు తెలిపారు. రెండ‌వ ద‌శ ప‌నుల‌ను 3 అంచెల్లో పూర్తి చేయ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు. 2023 లోగా ఆల‌య గ‌ర్భగుడి నిర్మాణం, ఇక 2024 లోపు ఆల‌య నిర్మాణం పూర్తి అవుతుంద‌ని తెలిపారు. ఇక 2025 నాటికి ఆలయ సముదాయంలో ప్రధాన నిర్మాణాలను పూర్తి చేస్తామ‌ని నృపేంద్ర మిశ్రా చెప్పారు.

రామమందిర నిర్మాణ ప్ర‌త్యేక‌త‌లు

ఆలయ నిర్మాణానికి నాయకత్వం వహిస్తున్న రామజన్మభూమి ట్రస్ట్ గత వారం ఒక ప్రకటన విడుదల చేస్తూ రాజస్థాన్‌లోని మక్రానా కొండల నుండి తెల్లటి గోళీలను ఆలయ గర్భగుడిలో ఉపయోగించనున్నట్లు పేర్కొంది. మందిరం గోడల నిర్మాణానికి 8 నుంచి 9 లక్షల క్యూబిక్ అడుగుల సున్నపురాయిని , పునాది కోసం 6.37 లక్షల క్యూబిక్ అడుగుల చెక్కిన గ్రానైట్, ఆలయం కోసం 4.70 లక్షల క్యూబిక్ అడుగుల గులాబీ ఇసుక‌ రాయిని ఉపయోగించ‌నున్న‌ట్టు అధికారులు ఓ నివేదిక‌లో తెలిపారు. అలాగే.. గర్భగుడి కోసం తెల్లటి మక్రానా మార్బుల్ వినియోగించనున్న‌ట్టు పేర్కొన్నారు. 

అంతకుముందు.. ఆగస్టు 2020లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలయ శంకుస్థాపన లేదా భూమి పూజ చేశారు. ఆ తర్వాత దాని నిర్మాణం ప్రారంభమైంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆలయం సిద్ధంగా ఉంటుందని భావిస్తున్నారు.

Scroll to load tweet…