దమ్ముంటే నన్ను కౌగిలించుకో, కానీ ఒకటికి పదిసార్లు ఆలోచించి : యోగి ఆదిత్యనాథ్

UP CM Yogi Adityanath fires on congress chief rahul gandhhi
Highlights

ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అవిశ్వాసం సందర్భంగా లోక్ సభలో ప్రధాని మోదీని కౌగిలించుకోవడంపై విమర్శల వర్షం కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే బిజెపి నాయకులతో పాటు దాని మిత్రపక్షాల నేతలు దేశం మొత్తం ప్రత్యక్షంగా చూస్తున్న సభలో రాహుల్ ఇలా ప్రవర్తించి ఉండాల్సింది కాదని విమర్శిస్తున్న విషయం తెలసిందే. ఈ విషయంలో రాహుల్ వ్యవహారాన్ని తప్పుబట్టిన ఓ ఆర్జేడీ నాయకున్ని ఆ పార్టీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా కాస్త ఘాటుగా స్పందించారు.

రాహుల్ కు దమ్ముంటే తనను కౌగిలించుకోవాలని యోగి సవాల్ విసిరారు. కానీ కౌగిలించుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి ఆ పని చేయాలని సూచించారు. పొలిటికల్ గా మైలేజ్ సాధించాలనే రాహుల్ నిండు సభలో ఈ పని చేశారని, కానీ అదే ఆయనకు ఇపుడు తలనొప్పి తెచ్చిపెట్టిందంటూ యోగి విమర్శించారు.

రాహుల్ గాంధీ పిల్ల చేష్టలు మానుకుని పరిణతితో కూడా రాజకీయాలు చేయాలని యోగి సూచించారు. ఓ జాతీయ పార్టీ అద్యక్షుడిగా రాహుల్ హుందాగా మెలగాలని,సమయాన్ని బట్టి  తెలివిగా  వ్యవహరించాలన్నారు. అయినా రాహుల్ కు సొంతంగా ఆలోచించే తెలివితేటలు ఎక్కడివంటూ ఎద్దేవా చేశారు. ఆయన చేసిన పనిని ప్రతిపక్షాలు ఎలా సపోర్ట్ చేస్తున్నాయని యోగి ప్రశ్నించారు.

ప్రతిపక్షాలన్నీ తామంతా ఒక్కటే అన్నట్లు కేవలం బయటకు మాత్రమే నటిస్తున్నాయన్నారు యోగి. రాహుల్ గాంధి ప్రధాని అభ్యర్థిత్వాన్ని బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్ లు అంగీకరిస్తారా? అంటూ సీఎం ప్రశ్నించారు. ప్రతిపక్షాలన్నీ ఎవరికి వారే సొంత ఎజెండాతో ముందుకు పోతున్నారని, కానీ మేమంతా ఒక్కటేనని బయటకు ప్రచారం చేస్తున్నారని యోగి ఆదిత్యనాథ్  విమర్శించారు.   

loader