ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్ ప్రయాణీస్తున్న హెలికాప్టర్ ను పక్షి ఢీకొట్టడంతో హెలికాప్టర్ ను పైలెట్ అత్యవసరంగా ల్యాండ్ చేశారు. 

లక్నో: యూపీ సీఎం Yogi Adityanath ప్రయాణీస్తున్న Helicopter ఆదివారం నాడు అత్యవసరంగా Varanasiలో ల్యాండ్ అయింది.Uttar Pradesh CM ప్రయాణీస్తున్న హెలికాప్టర్ ను Bird ఢీకొనడంతో పైలెట్ వెంటనే హెలికాప్టర్ ను అత్యవసరంగా లాండ్ చేశారు. సీఎం ప్రయాణీస్తున్న హెలికాప్టర్ సుల్తాన్ పూర్ కు బయలుదేరిన సమయంలో పక్షి హెలికాప్టర్ ను ఢీకొట్టింది. దీంతో హెలికాప్టర్ ను అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు పైలెట్. హెలికాప్టర్ కు సాంకేతిక పరీక్ష నిర్వహిస్తున్నారు. లక్నో నుండి వారణాసికి విమానాన్ని అధికారులు రప్పిస్తున్నారు. ఈ విమానంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ వెళ్లనున్నారు.

వారణాసిలోని రిజర్వ్‌ పోలీస్‌ లైన్స్‌ గ్రౌండ్‌ నుంచి హెలికాప్టర్‌ లక్నోకు బయలుదేరుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో సీఎం సర్క్యూట్ హౌస్ కి వెళ్లారని సమాచారం లక్నో నుండి వచ్చిన ప్రభుత్వ విమానంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ బయలుదేరాడు.శనివారం నాడు వారణాసిలో పర్యటించి అభివృద్ది పనులు, శాంతిభద్రతలను సీఎం సమీక్షించారు. ఆదివారం నాడు లక్నోకు బయలుదేరే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

సీఎం బయలుదేరిన హెలికాప్టర్ ను పక్షి ఢీకొనడంతో ఇక్కడే అత్యవసరంగా హెలికాప్టర్ ల్యాండ్ అయిందని జిల్లా మేజిస్ట్రేట్ కౌశల్ రాజ్ శర్మ చెప్పారు. శనివారం నాడు సీఎం వారణాసికి వచ్చారు. కాశీ విశ్వనాథ్ ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు.