యుపి ఏటీఎస్ అధికారి గన్ తో కాల్చుకుని ఆత్మహత్య

యుపి ఏటీఎస్ అధికారి గన్ తో కాల్చుకుని ఆత్మహత్య

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఉత్తర ప్రదేశ్ ఉగ్రవాద నిరోధక దళం (ఏటిఎస్) సీనియర్ పోలీసు అధికారి అధికారిక గన్ తో కాల్చుకుని మరణించాడు. ఈ సంఘటన ఆయన కార్యాలయంలో మంగళవారం చోటు చేసుకుంది. 

నిజానికి సాహ్నీ సెలవులో ఉన్నారు. కానీ మంగళవారం ఉదయం కార్యాలయానికి వెళ్లారు. దాదాపు 12.45 గంటలకు తన సిబ్బందిలో ఒకరిని పిలిచి తన వాహనంలో ఉన్న గన్ తీసుకుని రావాలని చెప్పాడు. ఆ గన్ తో ఆ తర్వాత అతను కాల్చుకున్నాడు.

రాజేష్ సాహ్నీ 1992 ప్రొవిన్షియల్ పోలీసు సర్వీస్ (పిపిఎస్) అదికారి. ఎడిజీ ఆనంద కుమార్ సంఘటనను ధ్రువీకరించారు. రాజేశ్ సాహ్నీ ఆత్మహత్యకు విచారం వ్యక్తం చేస్తూ యుపి పోలీసు డైరెక్టర్ జనరల్ విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.

రాజేష్ సాహ్నీని ఆయన సమర్థుడైన అధికారిగా ప్రశంసించారు. అతని ఆత్మహత్యకు గల కారణాలను తెలియలేదని అన్నారు. సాహ్ని అదనపు పోలీసు సూపరింటిండెంట్ హోదాలో ఉన్నారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM NATIONAL

Next page