బెంగళూరు వైద్యులు ఇటీవల ఓ మహిళకు అరుదైన ఆపరేషన్ చేశారు. ఆమె తలలో ‘‘గోళీల సంచి’’ మాదిరిగా ఎదుగుతున్న భాగాన్ని తొలగించారు. ఆరు నెలల పర్యవేక్షణ అనంతరం వారు ఆమె కోలుకున్నట్లుగా వైద్యులు వెల్లడించారు.  

బెంగళూరు వైద్యులు ఇటీవల ఓ మహిళకు అరుదైన ఆపరేషన్ చేశారు. ఆమె తలలో ‘‘గోళీల సంచి’’ మాదిరిగా ఎదుగుతున్న భాగాన్ని తొలగించారు. శ్రీ సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్ రేడియాలజీ జర్నల్‌లో ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను ప్రచురించారు. 52 ఏళ్ల మహిళ చిన్నప్పటి నుంచి తలపై ‘‘protuberance’’తో జీవిస్తోంది. కానీ ఇప్పటి వరకు ఈ విషయంగా ఆమె డాక్టర్లను సంప్రదించలేదు. ఎలాంటి నొప్పి లేనప్పటికీ.. దాదాపు 6 అంగుళాల పొడవు, 4 అంగుళాల వెడల్పుతో అది తలపై పెరుగుతూ పోయింది. 

ఎంఆర్ఐ స్కాన్‌లో ఆ మహిళ తల వెనుక భాగంలో కండకలిగిన జుట్టు బన్‌ను పోలీ వుందని జర్నల్‌లో తెలిపారు. ఈ పెరుగుతున్న భాగాన్ని తొలగించడానికి శస్త్రచికిత్స చేస్తుండగా.. అందులో ద్రవం, వెంట్రుకలు, కొవ్వు గడ్డలు, మందపాటి అంచులతో కూడిన కెరాటిన్ బంతులు వున్నాయని కనుగొన్నారు. కెరాటిన్ అంటే జుట్టు, గోర్లు, చర్మం బయటి పొరకు ఆధారంగా వుండే ఒక విధమైన ప్రోటీన్. ఆమె తలలో పెరిగిన ద్రవ్యరాశిని డెర్మోయిడ్ తిత్తులు అని పిలుస్తారు. ఇవి పిండ కణాల నుంచి అభివృద్ధి చెందుతూ.. జట్టు, దంతాలు, నరాలను కలిగి వుంటాయి. తరచుగా తల, మెడ ప్రాంతంలో ఎక్కువగా కనిపించే ఇవి.. అండాశయంతో పాటు శరీరంలోని ఇతర భాగాలలోనూ వుండవచ్చు. 

పుట్టుకతో పాటే పెరుగుతూ వచ్చిన ఈ నిర్మాణానికి ఖచ్చితమైన కారణంగా తెలియనప్పటికీ.. అవి ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. ఎలాంటి నొప్పి కలిగించనప్పటికీ.. ఇన్ఫెక్షన్లు, వాటికి దగ్గరలోని ఎముకలు దెబ్బతినడం వంటి సమస్యలకు అవి కారణమవుతాయని నిపుణులు అంటున్నారు. బాధిత మహిళ విషయంలో.. ఆమె వాపును పరీక్షించడానికి ఎందుకు ఇంతకాలం పట్టిందన్నది అధ్యయనం వివరించలేదు. పెరుగుతూ పోతున్న నిర్మాణాన్ని విజయవంతంగా తొలగించిన తర్వాత.. ఆమెను వైద్యులు దాదాపు ఆరు నెలలు పర్యవేక్షించారు. తర్వాత పెరుగుదల పునరావృతం కాలేదని జర్నల్‌లో తెలిపారు.