SRH vs GT : భారీ వర్షం.. హైదరాబాద్ vs గుజరాత్ మ్యాచ్ పై హెచ్సీఏ కీలక ప్రకటన
SRH vs GT : ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ కోసం టాప్-2 స్థానాల కోసం పోటీ పడుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్.. గుజరాత్ టైటాన్స్ తో తలపడనుంది. అయితే, హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షం కారణంగా టాస్ ఆలస్యం అయింది. మ్యాచ్ జరుగుతుందా? అనే సందేహాల మధ్య హెచ్సీఏ కీలక ప్రకటన చేసింది.
Sunrisers Hyderabad vs Gujarat Titans : హైదరాబాద్ లో వానలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షం కారణంగా నగరంలోని అనేక ప్రాంతాలు నీటమునిగాయి. ఈ క్రమంలోనే ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్న హైదరాబాద్-గుజరాత్ మ్యాచ్ పై ప్రభావం పడింది. వర్షం కారణంగా టాస్ ఆలస్యం అయింది. ఇప్పటికీ నగరంలో వర్షం పడుతుండటంతో గ్రౌండ్ ను కవర్లతో కప్పారు. అయితే, మ్యాచ్ జరుగుతుందా? అనే సందేహాల మధ్య హెచ్సీఏ కీలక ప్రకటన చేసింది.
ప్రస్తుతం నగరంలో భారీ వర్షం తగ్గుముఖం పట్టింది. అయితే, చిరుజల్లులు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే గ్రౌండ్ సిబ్బంది కవర్లతో మైదానాన్ని కప్పారు. పూర్తిగా వర్షం తగ్గిన తర్వాత వాటిని తొలగించి మ్యాచ్ ను నిర్వహించనున్నారు. అయితే, వర్షం కారణంగా టాస్ ఆలస్యమైందని హెచ్సీఏ తెలిపింది. వర్షం తగ్గింది కానీ ఔట్ ఫీల్డ్ తడిగా ఉందనీ, గ్రౌండ్ సిద్ధం చేసే పనులు కొనసాగుతున్నాయని హెచ్సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు తెలిపారు. దీని కోసం 100 మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారని పేర్కొన్నారు. మ్యాచ్ నిర్వహించడానికి రాత్రి 10:30 గంటల వరకు కూడా ఛాన్స్ ఉందనీ, అభిమానులు ఎవరూ నిరాశపడొద్దని పేర్కొన్నారు.
వర్షం కారణంగా ఇంకా టాస్ పడకపోవడంతో ఓవర్లను తగ్గించి మ్యాచ్ నిర్వహించే అవకాశముంది. ఒకవేళ వర్షం తగ్గకుండా ఇలాగే పరిస్థితులు ఉంటే మ్యాచ్ రద్దు అవుతుంది. ఇదే జరిగితే ఈ రోజు హైదరాబాద్ టీమ్ ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ కు అర్హత సాధిస్తుంది.
టీమిండియా ప్రధాన కోచ్ రేసులో దిగ్గజ ప్లేయర్లు.. అప్పుడే రచ్చ మొదలైంది !