పాలకులు కాదు కీచకులు: అధికారం ముసుగులో మహిళలపై అత్యాచారాలు

First Published 18, Dec 2019, 4:49 PM

స్వతంత్ర భారతదేశ చరిత్రలో బాలికలు, యువతుల, వివాహితలపై అత్యాచారాలు, హత్యలు చేసిన ప్రజాప్రతినిధులు ఎంతోమంది ఉన్నారు. 

1995లో ఢిల్లీకి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సునీల్ శర్మ తన భార్య నైనా సాహ్నిని అనుమానంతో తుపాకితో కాల్చాడు. అనంతరం మృతదేహాన్ని తందూరీ పొయ్యిలో వేసి తగులబెట్టారు. ఈ కేసులో ఆయనకు కోర్టు యావజ్జీవ కారాగార శిక్షను విధించింది

కేరళలోని ఇడుక్కి జిల్లాలో సూర్యనెళ్లిలో 16 ఏళ్ల బాలికను దాదాపు రెండు నెలల పాటు బందించిన 40 మంది ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో పలువురు రాజకీయ నాయకులు ఉన్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌కు చెందిన బీజేపీ మాజీ నేత చిన్మయానంద్‌ తనపై అత్యాచారానికి పాల్పడినట్టు ఓ యువతి కేసు పెట్టింది.

దీనితో పాటు యూపీకి చెందిన గాయత్రి ప్రసాద్ ప్రజాపతి, పురుషోత్తం నరేశ్ ద్వివేది, అమర్‌మణి త్రిపాఠి వంటి నేతలపై అత్యాచార కేసులు ఉన్నాయి.

ఉన్నావ్ విషయానికి వస్తే కుల్‌దీప్ సింగ్ సెంగార్ ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చాడు. ఈ ఘటన అనంతరం కొందరు ఎమ్మెల్యే అనుచరులు సైతం బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాధితురాలి తండ్రి పోలీస్ కస్టడీలో చనిపోయారు.

ఈ కేసులో విచారణ నిమిత్తం ఆమె న్యాయవాదితో పాటు ఓ వాహనంలో వెళుతుండగా.. ట్రక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాధితురాలి మేనత్తతో పాటు మరో బంధువు ప్రాణాలు కోల్పోయారు. దీనిలో ఎమ్మెల్యే హస్తం ఉందని అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో సుప్రీంకోర్టు కలగజేసుకుంది.

loader