ఆన్‌లాక్ 4.0 మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 7 నుంచి మెట్రో సేవలు ప్రారంభంకానున్నాయి. అయితే దశలవారీగా సేవల్ని ప్రారంభించనున్నారు.

ఇదే సమయంలో అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నిషేధం కొనసాగుతుందని కేంద్రం ప్రకటించింది. సెప్టెంబర్ 30 వరకు పాఠశాలలు తెరవడంపైనా నిషేధం ఉంటుందని వెల్లడించింది.

సెప్టెంబర్ 21 నుంచి వంద మందితో సభలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చింది. రాష్ట్రాలు సొంతంగా లాక్‌డౌన్ విధించుకోలేవని కేంద్రం ఉత్తర్వుల్లో పేర్కొంది.

సెప్టెంబర్ 21 నుంచి వంద మంది సభలు నిర్వహించుకోవచ్చని అనుమతించింది. అలాగే సెప్టెంబర్ 21 నుంచి ఓపెన్ ఎయిర్ థియేటర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమా థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్‌పై నిషేధం కొనసాగుతుందని చెప్పింది.