కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani)  సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా కూతురు షానెల్లె (Shanelle Irani ) నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది. ఈ సందర్బంగా కాబోయే అల్లుడికి స్వీటు వార్నింగ్ ఇచ్చారు.

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా కూతురు షానెల్లె (Shanelle Irani ) నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది. అర్జున్ భల్లాతో (Arjun Bhall) షానెల్లే నిశ్చితార్థం జరిగినట్టుగా పేర్కొంది. అయితే ఈ సందర్బంగా కాబోయే అల్లుడికి స్మృతి ఇరానీ.. స్వీటు వార్నింగ్ ఇచ్చింది. వివరాలు.. స్మృతి ఇరానీ తమ కుమార్తె షానెల్లే నిశ్చితార్థానికి సంబంధించిన రెండు ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. మొదటి ఫొటోలో అర్జున్ భల్లా.. మొకాళ్లపై కూర్చొని షానెల్లేకు ప్రపోజ్ చేస్తూ రింగ్ తొడుగుతున్నాడు. ఇక, రెండో ఫొటో.. కాబోయే దంపతులు ఇద్దరు కలిసి దిగిన సెల్పీ. ఈ ఫొటోలను షేర్ చేసిన స్మృతి ఇరానీ ఓ సందేశాన్ని కూడా పంచుకుంది.

తమ హృదయాల్లో నిలిచిన అర్జున్‌కు స్వాగతం పలుకుతున్నట్టుగా స్మృతి ఇరానీ పేర్కొన్నారు. ఒక క్రేజీ వ్యక్తి మామగా పొందినందుకు, అదే విధంగా అధ్వానమైన అత్తగా తనను పొందినందుకు ఆశీర్వదిస్తున్నాను అని కాబోయే అల్లుడికి స్వీటు వార్నింగ్ ఇచ్చారు. అధికారికంగా హెచ్చరిస్తున్నట్టుగా కూడా తెలిపారు. దేవుడి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నట్టుగా పేర్కొన్నారు. అయితే అర్జున భల్లాకు సంబంధించిన వివరాలను మాత్రం స్మృతి ఇరానీ వెల్లడించలేదు. 

అయితే స్మృతి ఇరానీ ఈ ఫొటోలు షేర్ చేసిన తర్వాత చాలా మంది ఆమె షానెల్లె గురించి తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేశారు. అయితే అసలు విషయం ఏమిటంటే.. స్మృతి ఇరానీ భర్త జుబిన్ ఇరానీ మొదటి భార్య కుమార్తె షానెల్లే. జుబిన్ ఇరానీ, అతని మొదటి భార్య మోనా ఇరానీల కుమార్తె. ఇక, స్మ‌తి ఇరానీ, జుబిన్ ఇరానీ దంపతులకు ఇద్దరు పిల్లలు.. జోయిస్‌, జోహార్‌ ఉన్నారు. తొలుత టీవీ సీరియల్స్‌తో స్మృతి ఇరానీ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఏక్తా కపూర్ Kyunki Saas Bhi Kabhi Bahu Thi సీరియల్‌లో ఆమె పాత్రకు విశేషమైన ఆదరణ లభించింది. ఆ తర్వాత బీజేపీలో చేరి అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర మంత్రి స్థాయికి చేరుకున్నారు. 

View post on Instagram

ఇక, షానెల్లే విషయానికి వస్తే ఆమె ముంబైలో పాఠశాల విద్యను అభ్యసించారు. అమెరికా ఉన్నత చదవులు చదివారు. ప్రస్తుతం న్యాయవాదిగా కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది.