విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ .. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (rahul gandhi) వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. 1970ల నుంచి పాకిస్థాన్, చైనాల మధ్య అణు సహకారం ఉందని .. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ 2013లో ప్రారంభమైందని ఆయన దెబ్బిపొడిచారు. "కాబట్టి, మీరే ప్రశ్నించుకోవాలంటూ రాహుల్ గాంధీకి హితవు పలికారు.
విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ .. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (rahul gandhi) వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు వరుస ట్వీట్‌లు చేసిన ఆయన.. గణతంత్ర దినోత్సవం (republic day) రోజున ఈసారి మన దేశానికి విదేశీ అతిథులు రాలేకపోయారని అన్నారు. ప్రస్తుతం కోవిడ్ థర్డ్‌వేవ్ దేశంలో విజృంభిస్తోందని భారతీయులకు తెలుసునని జైశంకర్ పేర్కొన్నారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా మధ్య ఆసియా నుంచి ఐదుగురు అధ్యక్షులను భారత్‌కు ఆహ్వానించామని ఆయన తెలిపారు. అయితే వారు జనవరి 26న వర్చువల్‌గా హాజరయ్యారని.. అయితే ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరు కాలేదంటూ జైశంకర్ దుయ్యబట్టారు. 1970ల నుంచి పాకిస్థాన్, చైనాల మధ్య అణు సహకారం ఉందని .. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ 2013లో ప్రారంభమైందని ఆయన దెబ్బిపొడిచారు. "కాబట్టి, మీరే ప్రశ్నించుకోవాలంటూ రాహుల్ గాంధీకి హితవు పలికారు.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా.. ఈ రోజు జరిగిన చర్చలో రాహుల్ గాంధీ ప్రభుత్వ విదేశాంగ విధానాన్ని తీవ్రంగా విమర్శించారు. చైనా, పాకిస్థాన్‌లను భారత్ దూరంగా ఉంచాలని హితవు పలికారు. కానీ ఆ పని చేయడంలో భారత్ విఫలమైందని... జమ్మూ కాశ్మీర్ (jammu and kashmir) వల్ల చైనా (china), పాకిస్థాన్‌లు (pakistan) దగ్గరయ్యాయని రాహుల్ అన్నారు. ఇది వ్యూహాత్మక తప్పిదమన్న ఆయన తన ప్రసంగంలో కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 (article 370) రద్దు గురించి కూడా ప్రస్తావించారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడం ఈ ప్రభుత్వం చేసిన పెద్ద తప్పు అంటూ దుయ్యబట్టారు.
అదే సమయంలో ఈసారి గణతంత్ర దినోత్సవం సందర్భంగా విదేశీ అతిథులు ఎవరూ హాజరుకాలేదంటూ రాహుల్ కేంద్రాన్ని ఎద్దేవా చేశారు. ఎందుకంటే భారత్.. ప్రస్తుతం పొరుగు దేశాల నుండి పూర్తిగా ఒంటరయ్యిందని వ్యాఖ్యానించారు. చైనా, పాకిస్థాన్‌లు తమ ఆయుధాల నిల్వలను పెంచుకుంటున్నాయని రాహుల్ గుర్తుచేశారు. దేశంలో 48 శాతం మంది ప్రజల ఆదాయం పడిపోయిందని.. రాష్ట్రపతి ప్రసంగంలో విజన్ లేదన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలను సర్వనాశనం చేశారని.. దేశంలో పేదలను కొల్లగొట్టి ధనికులకు పంచుతున్నారని రాహుల్ గాంధీ మండిపడ్డారు. న్యాయవ్యవస్థ, ఎలక్షన్ కమీషన్, పెగాసస్ (pegasus) వంటి వాటితో రాష్ట్రాల గొంతు నొక్కుతున్నారని ఆయన ఆరోపించారు.
ప్రధాని స్వయంగా ఇజ్రాయెల్ (modi israel visit) పర్యటనకు వెళ్లి పెగాసస్ స్పైవేర్‌పై ఒప్పందం చేసుకున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. అయితే రాహుల్ విమర్శలకు ధీటుగా బదులిచ్చింది అధికార పక్షం. పెగాసస్ అంశం కోర్టు (supreme court) పరిధిలో వుందని బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు. తనను అగౌరవపరిస్తే తాను బాధపడనని.. కానీ దేశ ప్రజలను అగౌరవపరిస్తే ఊరుకోనని రాహుల్ గాంధీ అన్నారు. ఈ దేశం కోసం మా కుటుంబం ప్రాణత్యాగాలు చేసిందని ఆయన గుర్తుచేశారు.
దేశంలో రాచరిక వ్యవస్థ నడుస్తున్నట్లుగా కనిపిస్తోందని.. మోడీ (narendra modi) ఓ రాజులా వ్యవహరిస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. మా నానమ్మను చంపేశారని.. మా నాన్నను బాంబులతో పేల్చేశారని ఆయన గుర్తుచేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలిసి ఈ దేశ పునాదులతో ఆడుకుంటున్నాయని.. దేశ పునాదులను బలహీనపరుస్తున్నారని రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే రాహుల్‌కు కేంద్ర మంత్రి జైశంకర్ కౌంటరిచ్చారు. దేశానికి అవసరమైనప్పుడే రాహుల్ గాంధీ సెలవుల కోసం విదేశాలకు వెళ్తారంటూ బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు సైతం ఎదురుదాడికి దిగారు. ఆయనకు దేశ సమస్యలపై అవగాహన లేదని ధ్వజమెత్తారు.
