Asianet News TeluguAsianet News Telugu

సోనియా ప్రధాని అయితే బాగుండేది.. కేంద్ర మంత్రి అథవాలే సంచలన వ్యాఖ్యలు

2004లోనే సోనియాగాంధీ ప్రధాని పదవి చేపట్టి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా చీఫ్‌, కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే. ఇండో అమెరికన్‌ మూలాలున్న కమలా హ్యారిస్ అగ్రరాజ్య ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినప్పుడు.. సోనియాగాంధీ మన దేశానికి ఎందుకు ప్రధాని కాకూడదని ప్రశ్నించారు. 

union minister ramdas athawale sensational comments on congress president sonia gandhi
Author
Hyderabad, First Published Sep 26, 2021, 9:53 PM IST

రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా చీఫ్‌, కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2004లోనే సోనియాగాంధీ ప్రధాని పదవి చేపట్టి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఆమె విదేశీ మూలాల వాదనకు అర్థం లేదని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా యూఎస్‌ వైఎస్‌ ప్రెసిడెంట్‌ కమల హ్యారిస్‌ను రామ్‌దాస్ ప్రస్తావించారు. యూపీఏ అధికారంలోకి వచ్చినప్పుడు.. సోనియాగాంధీ ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టాలని తాను ప్రతిపాదించినట్టు ఆయన గుర్తుచేశారు.

ఇండో అమెరికన్‌ మూలాలున్న కమలా హ్యారిస్ అగ్రరాజ్య ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినప్పుడు.. సోనియాగాంధీ మన దేశానికి ఎందుకు ప్రధాని కాకూడదని ప్రశ్నించారు. ఆమె రాజీవ్‌గాంధీ సతీమణి, లోక్‌సభ సభ్యురాలని అన్నారు. అలాగే 2004లో మన్మోహన్‌సింగ్‌ను కాకుండా శరద్‌పవార్‌ను ప్రధానిని చేస్తే బావుండేదని రామ్‌దాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Also Read:అవమానించిన పార్టీలో ఇంకా ఎందుకు.. ఎన్డీయేలోకి రండి: అమరీందర్‌కు కేంద్ర మంత్రి ఆహ్వానం

కొద్దిరోజుల క్రితం పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ ఎన్డీయేలోకి రావాలంటూ అథవాలె ఆహ్వానించి సంచలనం రేపారు. కాంగ్రెస్ పార్టీ అమరీందర్‌ను అవమానించిందని, అలాంటి పార్టీలో ఉండాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి చెప్పుకొచ్చారు. ఎన్డీయేలో ప్రతి ఒక్కరికి సమాన గౌరవం ఉంటుందని, అమరీందర్ ఎన్డీయేలోకి వస్తే త్వరలో జరగనున్న పంజాబ్ ఎన్నికల్లో ఎన్డీయే అధికారంలోకి వస్తుందని అథవాలె అన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios