Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ- ముంబై ఎక్స్‌ప్రెస్ వే: కారులో 170 కి.మీ వేగంతో గడ్కరీ టెస్ట్ డ్రైవ్

ఢిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌ వే (ఢీఎంఈ) 2023 మార్చి నాటికి పూర్తవుతుందన్నారు కేంద్ర రోడ్డు రవాణా, రహదారులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ. ప్రాజెక్టు నిర్మాణ పనులను పర్యవేక్షించేందుకు గానూ నితిన్‌ గడ్కరీ.. కారులో 170 కి.మీ వేగంతో ప్రయాణించారు

union minister nitin gadkaris test drive in delhi-mumbai expressway
Author
New Delhi, First Published Sep 19, 2021, 9:32 PM IST

ఢిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌ వే (ఢీఎంఈ) 2023 మార్చి నాటికి పూర్తవుతుందన్నారు కేంద్ర రోడ్డు రవాణా, రహదారులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ. ప్రాజెక్టు నిర్మాణ పనులను పర్యవేక్షించేందుకు గానూ నితిన్‌ గడ్కరీ.. కారులో 170 కి.మీ వేగంతో ప్రయాణించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో... 1350 కి.మీ ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణానికి రూ.98 వేల కోట్లు వెచ్చించగా.. ప్రస్తుతం దీని నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. సాధారణంగా ఢిల్లీ నుంచి ముంబయి వెళ్లాలంటే జాతీయ రహదారి ఎన్‌హెచ్‌ 48 (1421 కిమీ) ప్రయాణించాల్సి వస్తుంది. డీఎంఈ ఎక్స్‌ప్రెస్‌ హైవే కనుక అందుబాటులో వస్తే ఆ దూరం 70 కి.మీ. వరకు తగ్గుతుందన్నారు. అంతేకాకుండా. 25 గంటలు పట్టే ప్రయాణం తగ్గనుంది. దాదాపు 12 గంటలలోపే ఢిల్లీ చేరుకోవచ్చని నితిన్ గడ్కరీ అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios