Asianet News TeluguAsianet News Telugu

కేంద్రమంత్రికి మరోసారి బెదిరింపు కాల్స్.. రూ. 10 కోట్లు ఇవ్వకుంటే.. అంతే.. 

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి.  నెల రోజుల ముందు కూడా నితిన్ గడ్కరీకి హత్య బెదిరింపులు వచ్చాయి. కాల్ చేసిన వ్యక్తి రూ.10 కోట్లు డిమాండ్ చేశాడని, డబ్బులు ఇవ్వకుంటే కేంద్ర మంత్రికి హాని చేస్తానని బెదిరించినట్టు సమాచారం. 

Union Minister Nitin Gadkari receives threat calls at his Nagpur office
Author
First Published Mar 22, 2023, 1:51 AM IST

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి పదే పదే చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి.గత నెల రోజుల ముందు కూడా నితిన్ గడ్కరీకి హత్య బెదిరింపులు వచ్చాయి. తాజాగా మంగళవారం ఉదయం రెండుసార్లు బెదిరింపులు కాల్స్ వచ్చినట్లు సమాచారం. ఆ వ్యక్తి రూ. 10 కోట్లు  ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇవ్వకుంటే.. కేంద్రమంత్రి ప్రాణాలకు హాని జరుగుతుందని బెదిరించాడు. ఈ మొత్తం విషయంపై ఓ పోలీసు అధికారి సమాచారం అందించారు. దీంతో ఆయన ఇల్లు, కార్యాలయానికి భద్రతను పెంచారు. 

కాల్ చేసిన వ్యక్తి తనను జయేష్ పూజారి అలియాస్ జయేష్ కాంత్‌గా చెప్పుకున్నారనీ, అతని పేరును ఉపయోగించి జనవరిలో మంత్రి కార్యాలయానికి ఇలాంటి బెదిరింపు కాల్స్ చేసినట్లు పోలీసు అధికారి చెప్పారు. నాగ్‌పూర్‌లోని ఆరెంజ్ సిటీ హాస్పిటల్ ఎదురుగా ఉన్న గడ్కరీ పబ్లిక్ రిలేషన్స్ కార్యాలయానికి మూడు కాల్స్ వచ్చాయని పోలీస్ కమిషనర్ (జోన్-II) రాహుల్ మదనే తెలిపారు.  ఉదయం రెండుసార్లు, మధ్యాహ్నం 12 గంటలకు ఒకసారి కాల్స్ వచ్చినట్టు తెలిపారు. నాగ్‌పూర్ పోలీసులు విచారణ ప్రారంభించారు. కాల్ చేసిన వ్యక్తి రూ.10 కోట్లు డిమాండ్ చేశాడని, డబ్బులు ఇవ్వకుంటే కేంద్ర మంత్రికి హాని చేస్తానని బెదిరించాడని తెలిపారు. దీంతో గడ్కరీ సిబ్బంది అప్రమత్తమై నగర పోలీసులు విచారణ ప్రారంభించినట్లు కమిషనర్ తెలిపారు. మంత్రి ఇల్లు, కార్యాలయానికి భద్రత పెంచామన్నారు.

గంటన్నర వ్యవధిలో మూడు బెదిరింపు కాల్స్. జనవరి 14న ఉదయం 11:30 గంటల ప్రాంతంలో రెండు బెదిరింపు కాల్‌లు వచ్చాయి. ఉదయం 11:29 గంటలకు మొదటి బెదిరింపు ఫోన్ కాల్, ఆ తర్వాత 11:35 గంటలకు రెండో ఫోన్ కాల్, మధ్యాహ్నం 12:32 గంటలకు మూడో ఫోన్ కాల్ వచ్చింది. విషయం తీవ్రతను చూసి మహారాష్ట్ర ఏటీఎస్ కూడా విచారణలో నిమగ్నమైంది. అయితే బెళగావి జైలులో ఖైదీగా ఉన్న జయేష్ పూజారి అలియాస్ జయేష్ కాంత అనే వ్యక్తి బెదిరింపు కాల్ చేసినట్లు ఆ తర్వాత వెల్లడైంది. అప్పటి నుంచి జైలులో ఉన్న ఖైదీకి మొబైల్ ఎలా చేరిందనే ప్రశ్న కూడా తలెత్తింది.

చివరిసారిగా జనవరి 14న బెళగావి జైలు నుంచి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఆ సమయంలో జయేష్ పూజారి అనే నిందితుడు ఆఫీస్ నంబర్ కు ఫోన్ చేసి బెదిరించాడు. ఈరోజు మళ్లీ అదే జయేష్ పూజారి అలియాస్ జయేష్ కాంత పేరుతో బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపు వచ్చిన వెంటనే నితిన్ గడ్కరీ ప్రజా సంబంధాల కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగి పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాడు. పోలీసు శాఖ కూడా దీనిపై విచారణ ప్రారంభించింది. నితిన్ గడ్కరీకి చెందిన ఈ కార్యాలయం నాగ్‌పూర్‌లోని ఆరెంజ్ సిటీ హాస్పిటల్ సమీపంలో ఉంది. ఈ సమయంలో ఈ కాల్ చేస్తున్న వ్యక్తి యొక్క గుర్తింపు నిర్ధారించబడలేదు. చివ‌రిసారిగా ఆయ‌న ఆఫీస్‌పై బాంబులు వేసి చంపేస్తామ‌ని బెదిరింపులు వ‌చ్చాయి. అంతే కాదు రూ.100 కోట్ల ఇవ్వాలనీ, డబ్బులు ఇవ్వనందుకు చంపేస్తామని బెదిరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios