Asianet News TeluguAsianet News Telugu

విజయ మాల్యాపై పొగడ్తలు.. చిక్కుల్లో కేంద్ర మంత్రి

అంతా విజయ్‌మాల్యాను విమర్శిస్తున్నారు. కానీ మాల్యా ఏం చేశారో గుర్తుచేసుకోంది. అతడు చాలా తెలివైనవాడు. ఎంతోమంది తెలివైనవాళ్లకు ఉపాధి కల్పించాడు.

Union minister Jual Oram describes Vijay Mallya as 'smart'

బ్యాంకుల్లో రుణాలు తీసుకొని ఎగ్గొట్టి.. దేశం వదిలి పారిపోయిన ప్రముఖ పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యాపై ఓ కేంద్ర మంత్రి పొగడ్తల వర్షం కురిపించారు. విజయమాల్యా చాలా తెలివికలవాడంటూ పొగడి.. తాను చిక్కుల్లో పడ్డాడు. సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో తన ఉద్దేశం అది కాదని.. తప్పుగా అర్థం చేసుకున్నారంటూ వివరణ ఇవ్వడం మొదలుపెట్టాడు.

వివరాల్లోకి వెళితే...గిరిజన పారిశ్రామికవేత్తలకు భారీ రాయితీలిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటోందని చెబుతూ చేసిన కొన్ని వ్యాఖ్యలు కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జువల్‌ ఓరంను చిక్కుల్లో పడేశాయి.  

గిరిజన పారిశ్రామికవేత్తలకు భారీ రాయితీలిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటోందని చెబుతూ చేసిన కొన్ని వ్యాఖ్యలు కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జువల్‌ ఓరంను చిక్కుల్లో పడేశాయి.  గిరిజనులు అన్ని రంగాల్లో రాణించాలని, అలా కావాలంటే విజయ్‌ మాల్యాలా తెలివిగా ఆలోచించాలని మంత్రి సూచించారు. ఎస్సీ, ఎస్టీలు చాలా చాకచక్యంగా వ్యవహరించి బ్యాంకుల నుంచి సులువగా రుణాలు పొందాలని పిలుపునిచ్చారు.

షెడ్యూల్డు కులాలకు చెందిన వారు విద్య, ఉద్యోగాలు, రాజకీయాలు, ఇలా పలు రంగాల్లో రిజర్వేషన్లు పొందుతున్నారని, అయితే ఇతర సామాజిక వర్గాలవారితో సమానంగా చూడటం లేదని జువల్‌ ఓరం వ్యాఖ్యానించారు. ‘అంతా విజయ్‌మాల్యాను విమర్శిస్తున్నారు. కానీ మాల్యా ఏం చేశారో గుర్తుచేసుకోంది. అతడు చాలా తెలివైనవాడు. ఎంతోమంది తెలివైనవాళ్లకు ఉపాధి కల్పించాడు. ప్రభుత్వానికి, రాజకీయ నాయకులకు, బ్యాంకులకు మాల్యా చాలా చేశాడంటూ’ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారాం రేపాయి. 

దీంతో ఆయన వివరణ ఇచ్చాడు. తన ప్రసంగంలో పొరపాటున విజయమాల్యా పేరు వచ్చిందని చెప్పుకొచ్చారు. ‘అనుకోకుండా మాల్యా విషయం తీసుకొచ్చా. అయితే ఉద్దేశపూర్వకంగా చేయలేదు. తెలివైన వ్యక్తి అని మరొకరి పేరు చెప్పి ఉంటే బాగుండేది. వా వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నానని’ కేంద్ర మంత్రి జువల్‌ ఓరం అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios