సాధారణ మహిళలకే కాదు, సాక్షాత్తు మహిళా కేంద్ర మంత్రిని కూడా ఈవ్ టీజర్ల నుండి రక్షణ లేకుండా పోయింది.  సాధారణంగా కాలేజీ యువతుల్ని వేధించినట్లే ఎలాంటి భయం, బెరుకు లేకుండా కొందరు యువకులు కేంద్ర ఆరోగ్య, సంక్షేమ శాఖ సహాయమంత్రి అనుప్రియ పటేల్ ను వేధించారు. సెక్యూరిటీ సిబ్బంది ఉన్నా, ఆమె మంత్రి అని తెలిసినా వారు ఇలా  టీజింగ్ పాల్పడ్డారు. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని తన లోక్‌సభ స్థానం మీర్జాపూర్ నుంచి వారణాసి వెళ్తున్న సమయంలో ముగ్గురు యువకులు నంబర్ ప్లేట్ లేని కారులో వచ్చి మంత్రి కారును వెంబడించారు. మంత్రి కాన్వాయ్ ని ఓవర్ టేక్ చేస్తూ అనుప్రియను అసభ్య పదజాలంతో టీజింగ్ కు పాల్పడ్డారు. సెక్యూరటీ సిబ్బంది ఉన్నా భయపడకుండా పదే పదే మంత్రి కారుకు సమీంలోకి వెళుతూ దురుసుగా ప్రవర్తించారు.

ఈ ఘటనపై మంత్రి జిల్లా ఎస్పీ భరద్వాజ్ కు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై తగిన చర్యలు తీసుకుంటామనా ఎస్పీ తెలియజేశారు.

ఉత్తర ప్రదేశ్ లో యోగి సర్కారు రోమియో స్క్వాడ్ లను ఏర్పాటు చేసి ఈవ్ టీజర్లపై ఉక్కు పాదం మోపుతున్నా మహిళలపై ఆగడాలు ఆగడం లేదు. ఓ కేంద్ర మంత్రి పరిస్థితే ఇలా ఉంటే సామాన్యల పరిస్థితి ఇంకెంత దారణంగా ఉంటుందో ఆలోచించాలని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.