ఓటు హక్కు వినియోగించుకునేందుకు జనం గంటల తరబడి క్యూలైన్‌లో నిలబడటం తెలిసిందే. అలాంటిది ఏకంగా ఓ కేంద్రమంత్రి ఓటు వేయడానికి మూడున్నర గంటలు లైనులో నిలబడ్డారు.

రాజస్థాన్ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ తన స్వగ్రామానికి చేరుకున్నారు. ఉదయం 8 గంటలకల్లా బికనీర్ జిల్లాలోని 172వ పోలింగ్ బూత్‌కు వెళ్లగా... అప్పటికే పెద్ద సంఖ్యలో ఓటర్లు బారులు తీరి ఉన్నారు.

అయితే సాంకేతిక సమస్య కారణంగా ఈవీఎం కొంత సమయం పనిచేయలేదు. దీంతో తన వంతు వచ్చే వరకు ఆయన క్యూలో నిలుచునే ఉన్నారు. నిపుణులు సాంకేతిక సమస్యను పరిష్కరించిన తర్వాత నిదానంగా లైను కదిలింది. మేఘవాల్‌కు 11.30కు ఓటు వేసేందుకు అవకాశం కలిగింది. అర్జున్ రామ్ ఓటు వేసిన పాఠశాలలోనే ఆయన చదువుకున్నారు.. ఈ రోజు మేఘవాల్ పుట్టినరోజు కూడా.