ఏపీతో నాకు బంధుత్వం ఉంది, మీ సమస్యలు నాకు తెలుసు: అనంతకుమార్

First Published 26, Jul 2018, 2:51 PM IST
Union minister Anantkumar requested TDP MP's to stop protest in Lok Sabha
Highlights

ఆంధ్రప్రదేశ్‌తో తనకు దగ్గర బంధుత్వం ఉందని  కేంద్ర మంత్రి అనంతకుమార్  చెప్పారు.  ప్రత్యేక హోదాతో పాటు విభజన హమీలను వెంటనే  నెరవేర్చాలని టీడీపీ  ఎంపీలు గురువారం నాడు కూడ లోక్‌సభలో ఆందోళన కొనసాగించారు. 

ఆంధ్రప్రదేశ్‌తో తనకు దగ్గర బంధుత్వం ఉందని  కేంద్ర మంత్రి అనంతకుమార్  చెప్పారు.  ప్రత్యేక హోదాతో పాటు విభజన హమీలను వెంటనే  నెరవేర్చాలని టీడీపీ  ఎంపీలు గురువారం నాడు కూడ లోక్‌సభలో ఆందోళన కొనసాగించారు. 

లోక్‌సభ ప్రారంభం కాగానే టీడీపీ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కల్గించారు.  ఈ విషయమై పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ జోక్యం చేసుకొన్నారు. 

ఆందోళన విరమించి ఎవరి స్థానాల్లో వారు కూర్చోవాలని  కేంద్ర మంత్రి అనంతకుమార్  వారిని కోరారు.అయితే  టీడీపీ ఎంపీలు మాత్రం తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.  ఏపీకి ఇచ్చిన హమీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.  ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని  టీడీపీ ఎంపీలు కోరారు. 

దీంతో  కేంద్ర మంత్రి అనంతకుమార్ స్పందించారు. ఏపీ సమస్యలు తనకు కూడ తెలుసునని చెప్పారు. ఏపీ రాష్ట్రంతో తనకు దగ్గరి బంధుత్వం ఉందన్నారు. లోక్‌సభ సజావుగా సాగేందుకు సహకరించాలని అనంతకుమార్ కోరారు.

loader