మాజీ ఆగ్నివీరులకు అద్భుత అవకాశం ... ఆ నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్
భారత సైన్యంలో నిర్ణీత కాలానికి సేవలందించేందుకు చేరే అగ్నివీర్స్ విషయంలో హోంమంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వారికి కేంద్ర సాయుధ బలగాల నియామకాల్లో రిజర్వేషన్ కల్పించింది. ఎంతంటే...
Agniveer : అగ్నివీర్ పథకం ద్వారా ఇండియన్ ఆర్మీలో చేరేవారికి కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. ఇకపై కేంద్ర పారామిలటరీ బలగాలైన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ పోర్స్, బీఎస్ఎఫ్, ఆర్పీఎఫ్ విభాగాల్లో కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో మాజీ అగ్నివీరులకు రిజర్వేషన్ కల్పించారు. అగ్నివీర్ గా భారత సైన్యంలో సేవలందించిన వారికి కానిస్టేబుల్ నియామకాల్లో 10శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్లు సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్ ప్రకటించింది.
మాజీ అగ్నివీర్ లకు రిజర్వేషన్ పై సిఐఎస్ఎఫ్ డిజి నీనా సింగ్ మాట్లాడుతూ... అగ్నివీర్ వ్యవస్థ పారామిలటరీ బలగాలకు కూడా ఎంతో ఉపయోగకారిగా వుందన్నారు. అగ్నివీర్ ల ఎంపిక ద్వారా సిఐఎస్ఎఫ్ మరింత బలోపేతం అవుతుందన్నారు. అగ్నవీరులకు సైన్యంలో పనిచేసిన అనుభవం వుంటుంది కాబట్టి సిఐఎస్ఎఫ్ బలగాల్లో క్రమశిక్షణ పెరుగుతుంది... అదేవిధంగా మాజీ అగ్నివీరులకు కూడా పారామిలటరీ బలగాల్లో మంచి అవకాశం లభిస్తుందన్నారు
బిఎస్ఎఫ్ డిజి నితిన్ అగర్వాల్ మాట్లాడుతూ.... అగ్నివీర్ ద్వారా సుశిక్షుతులైన సైనికులు తయారవుతున్నారని అన్నారు. కాబట్టి వారి సేవలను మరింత ఎక్కువగా ఉపయోగించుకునేందుకు కేంద్ర బలగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పించడం చాలా ఉపయోగపడుతుందని అన్నారు.
ఇక సిఆర్ఎఫ్ఎఫ్ డిజి అనిష్ దయాల్ సింగ్ మాట్లాడుతూ... మజీ అగ్నివీరులకు సిఆర్ఎఫ్ఎఫ్ లో అవకాశం కల్పించడానికి నిర్ణయం తీసుకున్నామని అన్నారు. సైన్యంలో పనిచేస్తారు కాబట్టి అగ్నివీరులకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాల్సిన అవసరం వుండదన్నారు. అంటే నియామకంతోనే తమవద్ద శిక్షణ కలిగిన సిబ్బంది వుంటారన్నారు.