న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఆదివారం నాడు కరోనా సోకింది. 

కరోనా లక్షణాలు కన్పించగానే తాను పరీక్షించుకొన్నట్టుగా అమిత్ షా తెలిపారు. ఈ పరీక్షల్లో తనకు కరోనా ఉన్నట్టుగా తేలిందని ఆయన ప్రకటించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన స్పష్టం చేశారు. డాక్టర్ల సలహా మేరకు తాను ఆసుపత్రిలో చేరినట్టుగా ఆయన తెలిపారు. ఈ విషయాన్ని అమిత్ షా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

 

కొన్ని రోజులుగా తనతో కలిసి తిరిగిన వారంతా ఐసోలేషన్ కు వెళ్లాలని ఆయన సూచించారు.అంతేకాదు కరోనా పరీక్షలు చేయించుకోవాలని కూడ ఆయన సూచించారు.

ఢిల్లీలో కరోనా స్థితిగతులపై గత మాసంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో కలిసి ఆయన సమీక్షలునిర్వహించారు.ఢిల్లీలో కరోనా రోగుల కోసం అతి పెద్దకరోనా ఆసుపత్రి ప్రారంభోత్సవంలో ఆయన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో కలిసి ప్రారంభించారు.

also read:కరోనాపై నెగ్గిన 110 ఏళ్ల వృద్ధురాలు సైదమ్మ

ఢిల్లీలో కరోనా రోగులు పెద్ద సంఖ్యలో కోలుకొంటున్నారు. డిల్లీ ప్రభుత్వానికి కేంద్రం పూర్తిగా సహాయం అందిస్తోందని కరోనా సమీక్ష సందర్భంగా  ఆయన ప్రకటించారు.